రామానాయుడు స్టూడియోస్ లో నెక్ట్స్ పెళ్లి నాదే

త్వరలోనే దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి బాజా మోగబోతోంది. రామానాయుడు మనవడు, సురేష్ బాబు కొడుకు రానా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. రామానాయుడు స్టుడియోస్ లో తన ప్రేయసి మిహికా మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. అయితే రానా తర్వాత ఆ స్టుడియోలో జరిగే నెక్ట్స్ పెళ్లి తనదే అంటోంది శ్రీరెడ్డి.

కాస్టింగ్ కౌచ్ ఉదంతంతో లైమ్ లైట్లోకి వచ్చిన శ్రీరెడ్డి.. టాలీవుడ్ కు చెందిన చాలామంది హీరోలు, నిర్మాతలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రానా విషయంలో ఈమె మరోసారి కలుగజేసుకుంది. నిజానికి రామానాయుడు స్టుడియోస్ లో రానా పెళ్లి చేసుకోవడం లేదు. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ శ్రీరెడ్డి ఇలా చెప్పడం వెనక ఓ రీజన్ ఉంది.

రానా తమ్ముడు అభిరామ్, శ్రీరెడ్డి గతంలో చాలా క్లోజ్ గా ఉండేవారు. అభిరామ్ తో తను సన్నిహితంగా మెలిగిన ఫొటోల్ని శ్రీరెడ్డి రిలీజ్ చేసింది. అప్పట్లో ఆ ఇష్యూ చాలా పెద్దదైంది. ఆ టైమ్ లో రానాను బావ, సురేష్ బాబును మామ అని పిలవడం కూడా ప్రారంభించింది శ్రీరెడ్డి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని.. త్వరలోనే అభిరామ్ తో తన పెళ్లి రామానాయుడు స్టుడియోస్ లో జరుగబోతోందనే అర్థం వచ్చేలా శ్రీరెడ్డి కామెంట్ చేసింది.