Telugu Global
NEWS

జూమ్‌ మహానాడు ఆరు గంటలే....

తెలుగుదేశం పార్టీ చరిత్రలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేవలం 23 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో ఈసారి మహానాడు కూడా నామమాత్రంగానే సాగనుంది. కరోనా కూడా ఉండడంతో మహానాడు జూమ్‌ యాప్‌కే పరిమితం కానుంది. 14వేల మందితో జూమ్‌ యాప్‌ ద్వారా మహానాడు నిర్వాహించాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోనే తన నివాసం నుంచే జూమ్‌లో మహానాడును నిర్వహించబోతున్నారు. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జూమ్ మహానాడు జరుగుతుంది. మూడు రోజులు కలిపి కేవలం […]

జూమ్‌ మహానాడు ఆరు గంటలే....
X

తెలుగుదేశం పార్టీ చరిత్రలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేవలం 23 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో ఈసారి మహానాడు కూడా నామమాత్రంగానే సాగనుంది. కరోనా కూడా ఉండడంతో మహానాడు జూమ్‌ యాప్‌కే పరిమితం కానుంది.

14వేల మందితో జూమ్‌ యాప్‌ ద్వారా మహానాడు నిర్వాహించాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోనే తన నివాసం నుంచే జూమ్‌లో మహానాడును నిర్వహించబోతున్నారు.

ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జూమ్ మహానాడు జరుగుతుంది. మూడు రోజులు కలిపి కేవలం ఆరు గంటలు మాత్రమే మహానాడు కార్యక్రమం నిర్వహిస్తారు.

మొదటి రోజు మూడు గంటలు, రెండో రోజు మూడు గంటల చొప్పున ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర పాటు మహానాడు జూమ్‌ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆఖరి రోజు ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తారు. ఈ ఆరు గంటల సమయంలో అధినేతే అత్యధిక సమయం ప్రసంగించనున్నారు. నేతలు, కార్యకర్తలకు చాలా పరిమితంగా, ఎంపిక చేసిన వారికి మాత్రమే క్లుప్తంగా ప్రసంగించే అవకాశం ఇస్తారు.

First Published:  20 May 2020 8:36 PM GMT
Next Story