Telugu Global
National

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా రాదు

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా కేవలం మనిషి నుంచి మనిషికి మాత్రమే సంక్రమిస్తుందని.. మరేరకంగానూ ఈ వైరస్ సోకే అవకాశం లేదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వైరస్ పుట్టిన దగ్గర నుంచి ప్రజల్లో అనేక రకాలైన అపోహలు, అనుమానాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు పట్టుకున్న న్యూస్ పేపర్లు, కరెన్సీ నోట్లు, వారు వాడిన వస్తువులు తాకడం వల్ల ఇతరులకు వ్యాధి సోకుతుందని.. […]

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా రాదు
X

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా కేవలం మనిషి నుంచి మనిషికి మాత్రమే సంక్రమిస్తుందని.. మరేరకంగానూ ఈ వైరస్ సోకే అవకాశం లేదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వైరస్ పుట్టిన దగ్గర నుంచి ప్రజల్లో అనేక రకాలైన అపోహలు, అనుమానాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు పట్టుకున్న న్యూస్ పేపర్లు, కరెన్సీ నోట్లు, వారు వాడిన వస్తువులు తాకడం వల్ల ఇతరులకు వ్యాధి సోకుతుందని.. వాళ్లు తిరిగిన ప్రదేశాల్లో వ్యాధి సంక్రమిస్తుందని భావించారు. కాగా సీడీసీ అధ్యయనంలో ఇదంతా అవాస్తవమని తేలింది. ఇప్పటి వరకు ఈ విధంగా ఎవరికీ వ్యాధి సంక్రమించలేదని.. అలాంటి ఆధారాలు ఎక్కడా దొరకలేదని చెప్పింది.

కానీ, కరోనా ఉన్న రోగిని తాకితే మాత్రం వ్యాధి వస్తుందని.. వారి పక్కన కొద్దిసేపు నిలబడి మాట్లాడినా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. అయితే కరోనా వ్యాధిగ్రస్తుడు వాడిన వస్తువుల ఉపరితలాన్ని సాధారణ వ్యక్తి పట్టుకొని.. ఆ చేతులతో ముక్కు, కళ్లు, నోరు తాకితే మాత్రం వ్యాధి సంక్రమిస్తున్నట్లు తెలిపింది. చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా కడుక్కోవడం ద్వారా, శానిటైజర్లను వాడటం ద్వారా కోవిడ్-19 నుంచి కాపాడుకోవచ్చని సీడీసీ వివరించింది.

న్యూస్ పేపర్లు, కరెన్సీ నోట్ల ద్వారా కరోనా రాదని నిర్లక్ష్యంగా ఉండొద్దని కూడా సీడీసీ హెచ్చరించింది. ప్రస్తుతం ఈ అధ్యయనంపై విస్తృత చర్చ జరుగుతోంది. సీడీసీ అధ్యయనం నిజమేనని నిపుణులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే.. ఒకవేళ కరోనా వైరస్ న్యూస్ పేపర్లు, కరెన్సీ నోట్ల ద్వారా వస్తే.. ఇప్పటికల్లా ప్రపంచంలోని జనాభా అంతా ఈ వ్యాధి బారిన పడేవారేకదా అని అంటున్నారు.

First Published:  22 May 2020 1:37 AM GMT
Next Story