ఇలాంటి తీర్పుల వల్ల కోర్టులపై నమ్మకం పోతోంది….

డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుధాకర్ కేసు ఒక పిట్టీ కేసు మాత్రమేనని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం పైనా, ముఖ్యమంత్రి పైనా, మతాల పైనా సుధాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. సుధాకర్ తీరును సమర్థించేలా హైకోర్టు ఆదేశాలున్నాయన్నారు.

కోర్టుల తీర్పులను ప్రశ్నించకూడదని… కానీ ఇలాంటి తీర్పుల కారణంగా న్యాయస్థానాలపై నమ్మకం పోతోందని ఆమంచి వ్యాఖ్యానించారు. చిన్నచిన్న కేసులను కూడా సీబీఐ విచారణకు అప్పగిస్తే… ఇక ప్రతి పోలీస్ స్టేషన్‌ వద్ద సీబీఐ ప్రత్యేకంగా ఆఫీసులు పెట్టాల్సి ఉంటుందని ఆమంచి వ్యాఖ్యానించారు.