Telugu Global
National

సీబీఐకి మళ్లీ జైకొట్టిన చంద్రబాబు

మొహమాటం లేకుండా మాట మార్చడంలో చంద్రబాబు తన రికార్డులను తానే బద్ధలు కొట్టేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం… ప్రతిపక్షంలోకి రాగానే అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడడం చంద్రబాబుకు అలవాటే. ఇప్పుడు సీబీఐ విషయంలో మరోసారి అదే పంథాను అనుసరించారు. జగన్‌మోహన్ రెడ్డిపై సీబీఐ దాడులు జరిగినప్పుడు బాబు అండ్ బృందం సీబీఐని కీర్తించింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ అక్రమాలపై సీబీఐ కన్నేసిందని తెలియగానే… ఏకంగా ఏపీలో సీబీఐ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ జీవోలు ఇచ్చారు చంద్రబాబు. […]

సీబీఐకి మళ్లీ జైకొట్టిన చంద్రబాబు
X

మొహమాటం లేకుండా మాట మార్చడంలో చంద్రబాబు తన రికార్డులను తానే బద్ధలు కొట్టేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం… ప్రతిపక్షంలోకి రాగానే అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడడం చంద్రబాబుకు అలవాటే. ఇప్పుడు సీబీఐ విషయంలో మరోసారి అదే పంథాను అనుసరించారు. జగన్‌మోహన్ రెడ్డిపై సీబీఐ దాడులు జరిగినప్పుడు బాబు అండ్ బృందం సీబీఐని కీర్తించింది.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ అక్రమాలపై సీబీఐ కన్నేసిందని తెలియగానే… ఏకంగా ఏపీలో సీబీఐ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ జీవోలు ఇచ్చారు చంద్రబాబు. సీబీఐ మోడీ గూటి చిలుక అంటూ వ్యాఖ్యానించారు. సీబీఐకి అసలు విశ్వసనీయతే లేదన్నారు. ఇప్పుడు అదే సీబీఐ… కేంద్రంలో అదే మోడీ.. చంద్రబాబు వైఖరి మాత్రం మారిపోయింది.

డాక్టర్‌ సుధాకర్‌ అంశంపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించగానే నిమిషాల వ్యవధిలోనే చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మనస్పూర్తిగా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

2018 నవంబర్‌లో ఏపీలో సీబీఐ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ చంద్రబాబు జీవోలు ఇచ్చారు. ఆ సమయంలో ఏ వ్యవస్థ కూడా అదేంటి అని ప్రశ్నించలేదు. చంద్రబాబు ఏం చేసినా కరెక్టే అన్నట్టు అందరూచూస్తూ ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత … గతంలో చంద్రబాబు సీబీఐ అడుగు పెట్టడానికి వీల్లేదంటూ ఇచ్చిన జీవోలను రద్దు చేశారు.

First Published:  22 May 2020 7:54 PM GMT
Next Story