మహేష్ తో పోటీపడిన గౌతమ్

మహేష్ 6 అడుగుల పైన ఎత్తు ఉంటాడు. అతడి కొడుకు గౌతమ్ ఇంకా చిన్నోడు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. అయితే కొడుకు చిన్నోడే అయినా హైట్ లో మాత్రం దాదాపు తనకు దగ్గరగా వచ్చేశాడంటున్నాడు మహేష్. అంతేకాదు.. దానికి సంబంధించి ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు.

నిజమే.. మహేష్ కొడుకు గౌతమ్ దాదాపు తండ్రి అంత ఎత్తు ఉన్నాడు. మరో ఏడాది గడిస్తే కచ్చితంగా 6 అడుగులు టచ్ చేస్తాడు. తన కొడుకు చాలా పెద్దోడైపోయాడంటూ మహేష్ పెట్టిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల్లో లైకులు వచ్చాయి. కామెంట్స్ లో ప్రతి ఒక్కరు గౌతమ్ హైట్ చూసి షాక్ అవుతున్నారు.

ఈ లాక్ డౌన్ టైమ్ లో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాడు మహేష్. ఎంచక్కా కుటుంబ సభ్యులతో కాలం గడిపేస్తున్నాడు. నిజానికి మహేష్ కు ఎంతో ఇష్టమైన పని కూడా ఇదే. అందుకే ఈ లాక్ డౌన్ టైమ్ ను పూర్తిగా కూతురు సితార, కొడుకు గౌతమ్ కు కేటాయించాడు. వచ్చేనెలలో పరశురామ్ దర్శకత్వంలో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

View this post on Instagram

Height check!! He’s tall♥️♥️ #LockdownShenanigans

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on