రకుల్ మిస్సయిన ఆ 2 సినిమాలు

ప్రతి హీరోయిన్ కు తమ కెరీర్ లో మిస్సయిన కొన్ని సినిమాలుంటాయి. ఇలా చేతివరకు వచ్చి అలా మిస్సయిన సినిమాల్ని తలుచుకొని బాధపడని హీరోయిన్ ఉండదు. రకుల్ కెరీర్ లో కూడా అలాంటి సినిమాలు 2 ఉన్నాయి. వీటిలో ఒక సినిమాను తలుచుకొని ఆమె ఎప్పుడూ బాధపడుతుంది. అదే మిస్టర్ పెర్ ఫెక్ట్.

అవును.. ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పెర్ ఫెక్ట్ సినిమాలో ముందుగా రకుల్ నే తీసుకున్నారు. కేవలం తీసుకోవడం మాత్రమే కాదు.. ఆమెతో 4 రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ అంతలోనే ఏమైందో ఏమో రకుల్ ను తప్పించారు. ఆ స్థానంలో కాజల్ ను తీసుకున్నారు. మిస్టర్ పెర్ ఫెక్ట్ నుంచి ఎందుకు తప్పించారో ఇప్పటికీ తనకు తెలియదంటోంది రకుల్.

ఇక రకుల్ మిస్సయిన మరో సినిమా ఆటోనగర్ సూర్య. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో ముందుగా సమంతను హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె కాల్షీట్లు ఎడ్జెస్ట్ కాకపోవడంతో రకుల్ ను తీసుకున్నారు. అంతా ఓకే అనుకునే టైమ్ కు సమంత కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసింది. దీంతో రకుల్ ను తప్పించారు.

అలా తన కెరీర్ లో మిస్సయిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది రకుల్. అయితే అప్పట్లో తను సినీ కెరీర్ గురించి సీరియస్ గా ఆలోచించలేదని, డిగ్రీ చదవుతున్నానని చెప్పుకొచ్చింది. ఆ 2 సినిమా అనుభవాలు మాత్రం తనకు బాగా పనికొచ్చాయని చెబుతోంది.