ఏపీకి వస్తా… పర్మిషన్‌ ఇవ్వండి… ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్

60 రోజులు దాటింది. ఆయన ఏపీ వైపు అడుగు వేయలేదు. కరోనా భయంతో హైదరాబాద్‌లోనే సెటిల్‌ అయ్యారు. కానీ ఇప్పుడు ఏపీకి వస్తా పర్మిషన్‌ ఇవ్వండి అంటూ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఆయనే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదం తర్వాత తాను అక్కడికి వెళతానని అనుమతి ఇవ్వాలంటూ ప్రధానమంత్రికి లేఖ రాశారు. కానీ అక్కడి నుంచి ఆయనకు ఎటువంటి సమాధానం రాలేదు. కనీసం లేఖకు రిప్లే కూడా వచ్చినట్లు లేదు. దీంతో ఇన్నాళ్లు సైలెంట్ గా‌ ఉన్న ఆయన ఇప్పుడు ఏపీకి వస్తానంటూ ఏపీ డీజీపీకి లేఖ రాశారు.

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణంకు సోమవారం వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ, ఏపీ డీజీపీలను చంద్రబాబు కోరారు. ఎల్జీపాలిమర్స్‌ ఘటన బాధితులను పరామర్శించి… అక్కడి నుంచి రోడ్డు మార్గాన అమరావతి వెళ్తానని ఆయన కోరారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. దీంతో ఆయన విమానంలో వెళ్లేందుకు ఈ ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది.

మార్చి 20 నుంచి 4 వరుస లాక్‌డౌన్‌లతో హైదరాబాద్‌లో ఇంటినుంచి చంద్రబాబు అడుగు బయట పెట్టలేదు. ఈ వెసులుబాటు గమనించిన చంద్రబాబు అనుమతి కోసం రెండురాష్ట్రాల డీజీపీలకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్‌ పెట్టుకున్నారు.

అయితే తెలంగాణ డీజీపీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఏపీ డీజీపీ ఆఫీసు నుంచి ఇంకా పర్మిషన్‌ రాలేదని సమాచారం.