Telugu Global
Cinema & Entertainment

దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు ఓపెన్

దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ ఒకేసారి తెరుచుకునేలా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నిర్మాతలకు భరోసా ఇచ్చారు. కొంతమంది తెలుగు నిర్మాతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కిషన్ రెడ్డి.. టాలీవుడ్ కోలుకోవడానికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ప్రాంతీయ భాషా సినిమాల్ని ప్రోత్సహిస్తామని, అంతర్జాతీయంగా సినిమా పైరసీని అడ్డుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అన్ని భాషల చిత్రాలకు ఒకే తరహా జీఎస్టీని వసూలు చేస్తున్న విధానంపై పునఃసమీక్షిస్తామని హామీ […]

దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు ఓపెన్
X

దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ ఒకేసారి తెరుచుకునేలా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నిర్మాతలకు భరోసా ఇచ్చారు. కొంతమంది తెలుగు నిర్మాతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కిషన్ రెడ్డి.. టాలీవుడ్ కోలుకోవడానికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.

ప్రాంతీయ భాషా సినిమాల్ని ప్రోత్సహిస్తామని, అంతర్జాతీయంగా సినిమా పైరసీని అడ్డుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అన్ని భాషల చిత్రాలకు ఒకే తరహా జీఎస్టీని వసూలు చేస్తున్న విధానంపై పునఃసమీక్షిస్తామని హామీ ఇచ్చిన కిషన్ రెడ్డి.. ఏ రాష్ట్రంలో షూటింగ్ చేసుకున్నా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నిర్మాతలు సురేష్ బాబు, జెమినీ కిరణ్, అభిషేక్ అగర్వాల్, శరత్ మరార్, దర్శకుడు తేజ తదితరులు పాల్గొన్నారు. థియేటర్లు ప్రారంభమయ్యే సమయానికి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని రకాల శానిటేషన్ ఏర్పాట్లు పూర్తిచేస్తామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి టాలీవుడ్ తరఫున హామీ ఇచ్చారు నిర్మాతలు.

First Published:  24 May 2020 8:06 AM GMT
Next Story