రికార్డు సృష్టించిన కమ్ముల

కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్లు దాటుతోంది. చేసిన సినిమాలు మాత్రం (ప్రస్తుతం చేస్తున్న లవ్ స్టోరీతో కలిపి) జస్ట్ 9 మాత్రమే. దీన్ని బట్టి సినిమాల విషయంలో శేఖర్ కమ్ముల ఎంత స్లో అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

సగటున ప్రతి సినిమాకు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు ఈ డైరక్టర్. ఒక సినిమా పూర్తయి, రిలీజై, గ్యాప్ తీసుకున్న తర్వాతే మరో సినిమా ఎనౌన్స్ చేస్తాడు. అలాంటి కమ్ములు తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ప్రకటించాడు. నిజంగా ఇది కమ్ముల కెరీర్ లో రికార్డే.

ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు కమ్ముల. ఈ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ప్రకటించాడు. లవ్ స్టోరీ నిర్మాతైన నారాయణ్ దాస్ నారంగ్ తోనే నెక్ట్స్ సినిమా కూడా చేయబోతున్నాడు.

లవ్ స్టోరీకి సంబంధించి కేవలం ఇంకో 2 వారాల షూట్ మాత్రమే పెండింగ్ ఉంది. ఈలోగా లాక్ డౌన్ పడింది. ఈ గ్యాప్ లో తన మనసులో ఉన్న ఓ ఐడియాను స్టోరీ రూపంలో మార్చాడు కమ్ముల. స్టోరీలైన్ దాదాపు ఓ కొలిక్కి రావడంతో మూవీని ఎనౌన్స్ చేశాడు. ఓ పెద్ద హీరోతో కమ్ముల ఈ సినిమా చేయబోతున్నాడు.