బాలయ్య నెక్ట్స్ సినిమాపై సస్పెన్స్

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే మూవీపై ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే, ఈమధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్య చేతిలో ఇప్పుడు ఇద్దరు దర్శకులున్నారు.

బాలయ్య-బి.గోపాల్ కాంబినేషన్ మరోసారి తెరపైకి వస్తుందంటున్నారు. వీళ్లిద్దరి కాంబోలో సినిమా దాదాపు ఫిక్స్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. అయితే బోయపాటి సినిమా పూర్తయిన వెంటనే బి.గోపాల్ సినిమా సెట్స్ పైకి వస్తుందా అనేది అనుమానం. ఎందుకంటే మధ్యలో పూరి జగన్నాధ్ కూడా ఉన్నాడు.

పైసా వసూల్ తర్వాత మరోసారి కలిసి సినిమా చేయడానికి ఇద్దరూ అంగీకరించారు. ఈమధ్య లాక్ డౌన్ టైమ్ లో పూరి జగన్నాధ్ కూడా ఓ స్క్రిప్ట్ పూర్తిచేశాడు. అది బాలయ్య కోసమే అని టాక్. సో.. వీళ్లిద్దరిలో బాలయ్య ఎవరికి ఛాన్స్ ఇస్తాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.