సర్ ప్రైజ్ ఇచ్చిన సాయితేజ్

ఈ లాక్ డౌన్ టైమ్ ను తమ సినిమాల ప్రచారానికి వాడుకుంటున్నారు చాలామంది. ఆర్ఆర్ఆర్ టీజర్ కూడా లాక్ డౌన్ టైమ్ లోనే వచ్చింది. విశ్వక్ సేన్ లాంటి హీరోలైతే ఏకంగా లాక్ డౌన్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మూవీ ఓపెనింగ్స్ కూడా చేశారు. ఇప్పుడిదే బాటలో సాయితేజ్ కూడా నడుస్తున్నాడు. తన కొత్త సినిమాకు సంబంధించి ఈరోజు వీడియో రిలీజ్ చేశాడు సాయితేజ్.

సుబ్బు అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు సాయితేజ్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి “నో పెళ్లి” అనే సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేశారు. సాధారణంగా రిలీజ్ కు ముందు సాంగ్స్ అంటే అవి లిరికల్ వీడియో రూపంలోనే ఉంటాయి. ఇంకాస్త ముందుకెళ్తే.. సాంగ్ లో సగం వీడియోను ముందే రిలీజ్ చేసిన దాఖలాలున్నాయి.

అయితే తన సినిమా సాంగ్ తో చిన్నపాటి సర్ ప్రైజ్ ఇచ్చాడు సాయితేజ్. సాంగ్ మొత్తాన్ని రిలీజ్ చేయడమే కాకుండా.. అందులో వరుణ్ తేజ్, రానాను స్పెషల్ గెస్ట్స్ గా చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

పెళ్లి చేసుకోవద్దు, సోలో బ్రతుకే బెటర్ అనే కాన్సెప్ట్ తో ఈ పాటను తెరకెక్కించారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నితిన్ ఈ పాటను రిలీజ్ చేయగా.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న మరో హీరో రానా ఇందులో నటించడం విశేషం.