కొత్త దర్శకుడి కోసం ప్రకటించిన సినిమా వదిలేశాడు

నాని ఎప్పుడూ అంతే. కేవలం కథలు మాత్రమే చూస్తాడు. దర్శకుడు కొత్త-పాత అనే విషయం ఈ హీరోకు అస్సలు పట్టింపులేదు. ఈ క్రమంలో మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు నేచురల్ స్టార్. అయితే ఈ సినిమా కోసం ఏకంగా ఆల్రెడీ ప్రకటించిన సినిమాను నాని పక్కనపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీకాంత్ అనే వ్యక్తి రీసెంట్ గా నానికి ఓ కథ వినిపించాడు. ఆ కథ నానికి చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు నాని చేయని క్యారెక్టర్ అది. పైగా యూత్ కు, ఫ్యామిలీస్ కు కనెక్ట్ అయ్యే సినిమా. అందుకే వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

శ్రీకాంత్ సినిమాను చేయడం కోసం ఆల్రెడీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రకటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాను నాని పక్కనపెట్టినట్టు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం ఈ హీరో టక్ జగదీశ్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నాని నెక్ట్స్ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వస్తుంది.