హంసా నందిని అసలు పేరు తెలుసా?

ఒకప్పుడు హీరోయిన్. ఇప్పుడు ఐటెంసాంగ్స్ తో దుమ్ముదులిపేస్తోంది. సెక్సీనెస్ కు ఆమె కేరాఫ్ అడ్రస్. హంసానందిని అంటే గుర్తుపట్టని సినీ అభిమాని ఉండదు. అయితే అంతా అనుకుంటున్నట్టు హంసానందిని అసలు పేరు అది కాదు. అది కేవలం ఆమె తెరపేరు మాత్రమే. ఆమె అసలు పేరు పూనమ్.

అవును.. హంసానందిని అసలు పేరు పూనమ్. మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ, తన స్క్రీన్ నేమ్ వెనక జరిగిన తతంగాన్ని బయటపెట్టింది. తనకు ఇళయరాజా, దర్శకుడు వంశీ కలిసి పేరు పెట్టారని వివరించింది.

“పెద్ద వంశీ దర్శకత్వంలో నేను ఓ సినిమా చేశాను. అందులో ఆర్యన్ రాజేష్ హీరో. ఆ సినిమాలో నా పేరు మార్చేశారు. వంశీ గారు, ఇళయరాజా కలిసి నాకు హంసానందిని అనే పేరు పెట్టారు. హంస అంటే అందమైనదనే విషయం అందరికీ తెలిసిందే. ఇక హంసానందిని అనేది ఓ రాగం. వంశీ గారు హంస అని చెప్పగానే ఇళయరాజా గారు కాస్త సవరించి హంసానందినిగా మార్చారు. అలా నా పేరు మారిపోయింది.”

ఇలా తన పేరు వెనక జరిగిన గమ్మత్తైన విషయాన్ని హంసానందిని బయటపెట్టింది. నిజానికి వంశీ తీసిన అనుమానాస్పదం సినిమా కంటే ముందే హంసానందిని 2 తెలుగు సినిమాలు చేసింది. కానీ అందులో ఆమె అసలు పేరునే వాడారు. హంసానందినిగా పరిచయమైంది మాత్రం వంశీ సినిమాతోనే.