Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ కు "హిట్"

తెలుగులో ఈమధ్య కాలంలో హిట్టయిన సినిమాల్లో హిట్ ఒకటి. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని నిర్మించిన ఈ సినిమాతో శైలేష్ కొలను డైరక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే హిట్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ మేరకు నాని నుంచి రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్టు టాక్. ప్రస్తుతం హిందీలో […]

బాలీవుడ్ కు హిట్
X

తెలుగులో ఈమధ్య కాలంలో హిట్టయిన సినిమాల్లో హిట్ ఒకటి. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని నిర్మించిన ఈ సినిమాతో శైలేష్ కొలను డైరక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే హిట్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ మేరకు నాని నుంచి రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్టు టాక్.

ప్రస్తుతం హిందీలో జెర్సీ రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. దీంతో పాటు పైప్ లైన్లో ఎఫ్-2 సినిమా ఉంది. ఇప్పుడీ లిస్ట్ లోకి ”హిట్” కూడా చేరింది. బాలీవుడ్ లో రీమేక్ అయ్యే క్వాలిటీస్ అన్నీ హిట్ సినిమాకు ఉన్నాయి.

అయితే ఉన్నది ఉన్నట్టు రీమేక్ చేయాలని అనుకోవడం లేదు దిల్ రాజు. ఓ బాలీవుడ్ డైరక్టర్ చేతిలో ఈ ప్రాజెక్టు పెట్టి, భారీ మార్పులు చేర్పులతో ఈ సినిమాను పాన్-ఇండియా లెవెల్లో తీయాలని అనుకుంటున్నాడట. దిల్ రాజు ప్లాన్స్ అయితే భారీగానే ఉన్నాయి… కానీ ఈ కథను ఒప్పుకునే హిందీ హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

First Published:  27 May 2020 12:00 AM GMT
Next Story