మిడిల్ క్లాస్ జంట మళ్లీ కలుస్తోంది…

ఎంసీఏ.. మిడిల్ క్లాస్ అబ్బాయి.. నాని కెరీర్ లో ఇదొక హిట్ చిత్రం మాత్రమే. కానీ ఈ సినిమా పేరు ప్రస్తావించిన ప్రతిసారి ఓ మేజిక్ గుర్తొస్తుంది. అదే నాని-సాయిపల్లవి కెమిస్ట్రీ. సినిమాలో వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ కలుసుకోలేదు వీళ్లిద్దరు. అలా ఈ జంటకు లాంగ్ గ్యాప్ వచ్చేసింది.

ఎట్టకేలకు నేచురల్ స్టార్, నేచురల్ బ్యూటీ మళ్లీ కలుస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ. ఈ సినిమాలో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉందో, హీరోయిన్ పాత్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. అందుకే సాయిపల్లవి అయితే బాగుంటుందని స్వయంగా నాని చెప్పడంతో ఆ దిశగా మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ప్రస్తుతం నాగచైతన్య సరసన లవ్ స్టోరీ అనే సినిమా చేస్తోంది సాయిపల్లవి. అటు రానాతో కలిసి విరాటపర్వం మూవీ చేస్తోంది. ఈ రెండు సినిమాలు దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేశాయి. కాబట్టి నాని సరసన సాయిపల్లవి నటించడానికి కాల్షీట్ల ప్రాబ్లమ్ ఉండదు. ఎటొచ్చి ఆ క్యారెక్టర్ సాయిపల్లవికి నచ్చాలంతే.