Telugu Global
National

టీటీడీపై ప్రచారం చంద్రబాబు కుట్రే " సుబ్రమణ్యస్వామి

టీడీపీ ఆస్తులు విక్రయించేందుకు జరిగిన ప్రయత్నాలపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఇతర బీజేపీ నేతలకు భిన్నంగా స్పందించారు. ఇదంతా రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్న తప్పుడు ప్రచారమని ఆయన వ్యాఖ్యానించారు. దీని వెనుక చంద్రబాబునాయుడు కుట్ర ఉందని ఆరోపించారు. చంద్రబాబునాయుడుకు కుట్రలు, మోసాలు చేయడం మొదటి నుంచి అలవాటేనని… ఇప్పుడు కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ఏపీకి తీరని ద్రోహం చేస్తున్నారని సుబ్రమణ్యస్వామి విమర్శించారు. టీటీడీ ఆస్తులు వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమేనని… అందుకోసం వేసిన కమిటీలో […]

టీటీడీపై ప్రచారం చంద్రబాబు కుట్రే  సుబ్రమణ్యస్వామి
X

టీడీపీ ఆస్తులు విక్రయించేందుకు జరిగిన ప్రయత్నాలపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఇతర బీజేపీ నేతలకు భిన్నంగా స్పందించారు. ఇదంతా రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్న తప్పుడు ప్రచారమని ఆయన వ్యాఖ్యానించారు. దీని వెనుక చంద్రబాబునాయుడు కుట్ర ఉందని ఆరోపించారు.

చంద్రబాబునాయుడుకు కుట్రలు, మోసాలు చేయడం మొదటి నుంచి అలవాటేనని… ఇప్పుడు కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ఏపీకి తీరని ద్రోహం చేస్తున్నారని సుబ్రమణ్యస్వామి విమర్శించారు.

టీటీడీ ఆస్తులు వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమేనని… అందుకోసం వేసిన కమిటీలో బీజేపీ నేత భానుప్రకాశ్‌ రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారని… ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద కూడా ఉన్నాయన్నారు.

కేవలం రాజకీయ దురుద్దేశంతోనే జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆస్తుల విక్రయాన్ని నిలిపివేస్తూ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. నిజాయితీ, నిబద్ధత ఉన్న అరుదైన రాజకీయ నేత వైఎస్‌ జగన్‌ అని ఆయన ప్రశంసించారు.

టీటీడీ ఆస్తుల వేలంపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం.. చంద్రబాబు కుట్రలకు కొందరు ఏపీ బీజేపీ నేతలు వత్తాసు పలకడం దురదృష్టకరమని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. అప్పట్లో టీటీడీ ఆస్తుల వేలాన్ని సమర్థించిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. ఇళ్లల్లో ఉపవాస దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.

ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం అక్కడి కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ లాంటి దేవాలయాలతో సహా అన్ని దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని… ఈ విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు తెలుసుకోవడం మంచిదని సూచించారు. ఉత్తరాఖండ్‌లో ఆలయాన్ని స్వాధీనం చేసుకుని తనకు తానే అన్ని ఆలయాలకు చైర్మన్‌గా అక్కడి ముఖ్యమంత్రి ప్రకటించుకున్నారని… మరీ ఏపీలో దీక్షలు చేస్తున్న బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు.

ప్రజలను తప్పుదోవ పట్టించిన చంద్రబాబునాయుడు వెంటనే దీనిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును ప్రజలు నిలదీయాలని సూచించారు. అలాగే నాడు ఆస్తులు అమ్మాల్సిందిగా నివేదిక ఇచ్చి… ఇప్పుడు దీక్షలు చేస్తున్న బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డిని కూడా ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికైనా చంద్రబాబునాయుడు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు.

First Published:  26 May 2020 7:35 PM GMT
Next Story