Telugu Global
NEWS

పారిపోయిందన్న కియో మరో భారీ పెట్టుబడి

ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘మన పాలన- మీ సూచన’ కార్యక్రమంలో ‘పరిశ్రమలు- పెట్టుబడులు’ అంశంపై పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చర్చించారు. వారి నుంచి సూచనలు తీసుకున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. అవినీతికి తావు లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీతో గెలిచిన సుస్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. కేంద్రంలో హంగ్ ప్రభుత్వం […]

పారిపోయిందన్న కియో మరో భారీ పెట్టుబడి
X

ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘మన పాలన- మీ సూచన’ కార్యక్రమంలో ‘పరిశ్రమలు- పెట్టుబడులు’ అంశంపై పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చర్చించారు. వారి నుంచి సూచనలు తీసుకున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. అవినీతికి తావు లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీతో గెలిచిన సుస్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. కేంద్రంలో హంగ్ ప్రభుత్వం వచ్చి ఉంటే ప్రత్యేక హోదా కూడా సాధించేవారిమన్నారు. చంద్రబాబునాయుడు ఎన్‌డీఏలో ఉండి కూడా ప్రత్యేక హోదా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని ముఖ్యమంత్రి విమర్శించారు. ఏపీలో పెట్టుబడులకు అన్ని అవకాశాలున్నాయని… హైదరాబాద్‌, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖపట్నానికి ఉందన్నారు.

టీడీపీ ప్రభుత్వం మాటలకు, గ్రాఫిక్స్ బొమ్మలకు పరిమితమైందన్నారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలను 2014-19 వరకు రూ.4వేల కోట్లు బకాయిలు ఉంచి వెళ్లారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం డిస్కంలకు రూ.20వేల కోట్ల బకాయిలు పెట్టిందన్నారు.
కియో పరిశ్రమ వెళ్లిపోతోందంటూ తప్పుడు ప్రచారం చేశారని ముఖ్యమంత్రి విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని… బలమైన బ్యాకింగ్ వ్యవస్థ ఉందని చెప్పారు.

హైదరాబాద్‌, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉంది. విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు.

ఈ సందర్భంగా కియో సంస్థ సీఈవో కుకున్ షిమ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించారు. మరో 54 మిలియన్ డాలర్లను ఏపీలో పెట్టుబడిగా పెడుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కియో పరిశ్రమకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని… పరిశ్రమల స్థాపనకు ఎన్నో అనుకూలతలు ఏపీలో ఉన్నాయని విదేశీపెట్టుబడిదారులు భావిస్తున్నారని కుకున్ చెప్పారు.

First Published:  28 May 2020 8:16 AM GMT
Next Story