Telugu Global
Cinema & Entertainment

వర్మ కథ "క్లైమాక్స్" కొచ్చింది

మొన్నటివరకు విడతల వారీగా మియా మాల్కోవా అందాల్ని చూపించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అసలు మేటర్ లోకి వచ్చాడు. మియా మాల్కోవాతో క్లైమాక్స్ అనే సినిమా తీసిన ఆర్జీవీ.. దాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడం కోసం వెయిట్ చేయడం లేదు. కేవలం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కోసమే దాన్ని తీశాడు. ఈ మేరకు దానికి సంబంధించిన వివరాల్ని బయటపెట్టాడు. క్లైమాక్స్ సినిమాను తన నిర్మాణ భాగస్వామి అయిన శ్రేయాస్ ఈటీ అనే యాప్ పై విడుదల […]

వర్మ కథ క్లైమాక్స్ కొచ్చింది
X

మొన్నటివరకు విడతల వారీగా మియా మాల్కోవా అందాల్ని చూపించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అసలు మేటర్ లోకి వచ్చాడు. మియా మాల్కోవాతో క్లైమాక్స్ అనే సినిమా తీసిన ఆర్జీవీ.. దాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడం కోసం వెయిట్ చేయడం లేదు. కేవలం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కోసమే దాన్ని తీశాడు. ఈ మేరకు దానికి సంబంధించిన వివరాల్ని బయటపెట్టాడు.

క్లైమాక్స్ సినిమాను తన నిర్మాణ భాగస్వామి అయిన శ్రేయాస్ ఈటీ అనే యాప్ పై విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు వర్మ. జూన్ 6న రాత్రి 9 గంటలకు సినిమాను స్ట్రీమింగ్ కు పెడతామని తెలిపాడు. అయితే ఇది ఫ్రీ కాదు. సినిమా చూడాలనుకుంటే వంద రూపాయలు చెల్లించాలి.

సరిగ్గా ఇక్కడే వర్మపై సెటైర్లు పడుతున్నాయి. థియేటర్లకు వెళ్లి వంద రూపాయలు పెట్టి వర్మ తీసిన సినిమాలు చూసే రోజులు ఎప్పుడో పోయాయి. ఈ దర్శకుడి సినిమాలన్నీ ప్రచార ఆర్భాటానికే పరిమితం తప్ప థియేటర్లలో క్లిక్ అయిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నెట్ లో వంద రూపాయలు పెట్టి మియా మాల్కోవా నటించిన క్లైమాక్స్ సినిమాను జనాలు చూస్తారనుకోవడం వర్మ అత్యాశే అంటున్నారు.

First Published:  29 May 2020 10:00 AM GMT
Next Story