హైకోర్టుపై దూషణలు… గ్రామ వాలంటీర్‌ అరెస్ట్, ఉద్యోగం ఊస్ట్‌

డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడంపై హైకోర్టును తప్పుపడుతూ పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేసే పని మొదలుపెట్టింది ఏపీ సీఐడీ. 49 మందిపై హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది. రంగంలోకి దిగిన సీఐడీ అరెస్ట్‌లు మొదలుపెట్టింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం మూలపల్లి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్‌ కొండారెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

49 మందిలో కొండా రెడ్డి కూడా ఒకరు. కేసు నేపథ్యంలో కొండారెడ్డిని గ్రామ వాలంటీర్‌ పోస్టు నుంచి అధికారులు తొలగించారు. కొండారెడ్డిని మూలపల్లిలో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.

హైకోర్టును ఎందుకు దూషించారు?, ఈ మూకుమ్మడి దాడి వెనుక ఏదైనా ప్రేరణ ఉందా? అన్న కోణంలో పోలీసులు కొండారెడ్డిని విచారించారు. మిగిలిన నెటిజన్ లను కూడా అరెస్ట్ చేసేందుకు సీఐడీ ప్రయత్నిస్తోంది.