Telugu Global
NEWS

అకాల వర్షాలు... పిడుగులు... ఏపీలో ఎనిమిది మంది మృతి

ఎంఫన్ తుఫాను బారి నుంచి తప్పించుకోగలిగిన ఉత్తరాంధ్ర.. ఆ తర్వాత ఎండల ధాటికి తట్టుకోలేక పోయింది. ఉదయం 8 దాటితే భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోయారు. దీనికి తోడు పక్కనే సముద్రం ఉండటంతో ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మరి కొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ప్రజల ప్రాణాలకే ముప్పని అందరూ భావించారు. అయితే శుక్రవారం రోజు అనూహ్యంగా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడింది. అప్పటి వరకు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితి […]

అకాల వర్షాలు... పిడుగులు... ఏపీలో ఎనిమిది మంది మృతి
X

ఎంఫన్ తుఫాను బారి నుంచి తప్పించుకోగలిగిన ఉత్తరాంధ్ర.. ఆ తర్వాత ఎండల ధాటికి తట్టుకోలేక పోయింది. ఉదయం 8 దాటితే భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోయారు. దీనికి తోడు పక్కనే సముద్రం ఉండటంతో ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మరి కొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ప్రజల ప్రాణాలకే ముప్పని అందరూ భావించారు.

అయితే శుక్రవారం రోజు అనూహ్యంగా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడింది. అప్పటి వరకు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితి కాస్తా చల్లగా మారిపోయింది. మూడు రోజులుగా ఎండకు తాళలేక ఉన్న ప్రజలు వరుణుడి రాకతో పులకించిపోయారు. మేఘాలు దట్టంగా అలుముకొని వాతావరణాన్ని చల్లబర్చడమే కాకుండా.. వర్షం కూడా పడింది.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పడిన ఈ వర్షానికి ఉపశమనం లభించినా.. పిడుగుల వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ముగ్గురు, గీతనాపల్లిలో ఇద్దరు, శ్రీహరిపురంలో ఒకరు, వంతరాంలో ఇద్దరు మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు.

మరోవైపు పిడుగుల ధాటికి ఏడు గొర్రెలు, విద్యుత్ వైర్లు తెగిపడి రెండు గేదెలు కూడా మృతి చెందాయి. అకాల వర్షాలకు మామిడి పంట నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది.

First Published:  30 May 2020 12:15 AM GMT
Next Story