Telugu Global
Cinema & Entertainment

ఓటీటీలపై మరో వారం రోజుల్లో క్లారిటీ

ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దలంతా షూటింగ్స్ మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలి. లొకేషన్ లో గైడ్ లైన్స్ ఏంటి అనే అంశాలపై మాత్రమే చర్చిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, షూటింగ్స్ ను సాఫీగా కొనసాగించడం ఎలా అనే టాపిక్ పైన మాత్రమే దృష్టిపెట్టారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. థియేటర్లు తెరిచే అంశంపై ఇంకా చర్చించాల్సి ఉంది. ఇంతలోనే ఓటీటీ రిలీజ్ ల వ్యవహారం కూడా నిర్మాతల మండలి వద్దకు చేరింది. థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే […]

tollywood hero
X

ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దలంతా షూటింగ్స్ మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలి. లొకేషన్ లో గైడ్ లైన్స్ ఏంటి అనే అంశాలపై మాత్రమే చర్చిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, షూటింగ్స్ ను సాఫీగా కొనసాగించడం ఎలా అనే టాపిక్ పైన మాత్రమే దృష్టిపెట్టారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. థియేటర్లు తెరిచే అంశంపై ఇంకా చర్చించాల్సి ఉంది. ఇంతలోనే ఓటీటీ రిలీజ్ ల వ్యవహారం కూడా నిర్మాతల మండలి వద్దకు చేరింది.

థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే సినిమాను ఓటీటీకి ఇచ్చే అంశంపై నిర్మాతల మండలి వచ్చే వారం ఓ నిర్ణయం తీసుకోబోతోంది. ఎవరికి తోచినట్టు వాళ్లు తమ సినిమాల్ని ఓటీటీకి ఇచ్చుకుంటూ వెళ్తే, మొదటికే మోసం వస్తుంది కాబట్టి దీనిపై ఓ కార్యాచరణను సిద్ధంచేయాలని పెద్దలు నిర్ణయించారు. ఏ నిర్మాతలైతే తమ సినిమాల్ని థియేటర్లతో సంబంధం లేకుండా ఓటీటీకి ఇవ్వాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్లను పిలిచి మాట్లాడాలనుకుంటున్నారు.

అంతిమంగా.. థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా ఓ సినిమాను ఓటీటీకి ఇవ్వొద్దనే నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలోనైతే ఛాంబర్ ఉంది. అయితే దీన్ని ఎంతమంది పాటిస్తారనేది ఇక్కడ ప్రశ్న. గతంలో ఇలానే ఓటీటీ రిలీజ్ పై ఓ నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్లలో రిలీజైన 7 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో పెట్టాలని రూల్ పెట్టుకున్నారు. కానీ ఆ నిబంధనని తుంగలో తొక్కుతూ ఎన్నో సినిమాలొచ్చేశాయి. రీసెంట్ గా ఓ పిట్టకథ అనే సినిమా ఏకంగా రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది.

ఈ నేపథ్యంలో.. విడుదలకు ముందే సినిమాను ఓటీటీకి ఇవ్వొద్దంటే ఎంతమంది నిర్మాతలు అంగీకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. థియేట్రికల్ రిలీజ్ వరకు ఎదురుచూస్తూ కూర్చుంటే.. తమ ఆర్థిక భారం ఎవరు భరిస్తారనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఇలా ఈ వ్యవహారం చుట్టూ చాలా చిక్కుముడులు ఉన్నాయి. దీనిపై మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అన్నట్టు.. మిగతా చిత్ర పరిశ్రమల్లో ఎవ్వరూ ఇలాంటి మీటింగ్స్ పెట్టడం లేదు. నిర్మాత తనకు నచ్చినట్టు వ్యవహరించొచ్చు.

First Published:  30 May 2020 9:41 AM GMT
Next Story