వెబ్ సైట్ పై పూనమ్ ఫైర్

ఒకప్పటి హీరోయిన్ (ఇప్పుడు అవకాశాల్లేవ్) పూనమ్ కౌర్ నిత్యం ఏదో ఒక వివాదంలో నలుగుతూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు కూడా ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతుంటాయి. ఇదే కోవలో తాజాగా మరో ట్వీట్ పెట్టారు పూనమ్. ఈసారి ఏకంగా ఓ వెబ్ సైట్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు.

“ఈ వెబ్‌సైట్ లలో మంచి ఫోటోలు వాడాలి. మంచి పనుల్ని ఎలాగూ మీరు ప్రోత్సహించరని నాకు తెలుసు… కనీసం మంచి ఫోటోలైనా పెట్టండి. ఆంధ్రావాళ్లు నా వెనకపడ్డారు.. దయచేసి చెత్త ఫొటోలు పెట్టకండి.. పెట్టే వార్తలో ఎలాగూ మంచి ఉండదు, కనీసం మంచి ఫొటో అయినా పెట్టండి.”

ఇలా ఓ వెబ్ సైట్ పై విరుచుకుపడింది పూనమ్ కౌర్. అయితే ఆ వెబ్ సైట్ ఏంటనే విషయాన్ని పూనమ్ బయటపెట్టలేదు. ఈ హీరోయిన్ ఎప్పుడూ ఇంతే. ఏదో ఒక ట్వీట్ పెడుతుంది. ఆ ట్వీట్ వెనక పరమార్థం, అంరతార్థం ఏంటనేది అతికొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. అంత ధైర్యం లేనప్పుడు ఇలాంటి పోస్టులు పెట్టడం ఎందుకో.. అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.