3 పచ్చళ్ల డబ్బాలు ఖాళీ చేశాను – సమంత

ఈ క్వారంటైన్ టైమ్ లో హీరోయిన్లంతా తమ అందాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బరువు పెరగకుండా రెగ్యులర్ గా ఎక్సర్ సైజులు చేస్తున్నారు. కానీ సమంత మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఈ లాక్ డౌన్ టైమ్ లో కడుపునిండా అన్ని లాగించేస్తున్నానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

“అంతా అనుకుంటున్నట్టు నేను ఫాస్టింగ్, డైటింగ్ చేయడం లేదు. రోజు తప్పించి రోజు బిర్యానీ లాగించేస్తున్నాను. అంతేకాదు.. ఇంట్లో ఇప్పటికే 3 పచ్చళ్ల డబ్బాలు ఖాళీ చేశాను. నాకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం. అందుకే ఈ లాక్ డౌన్ టైమ్ లో రకరకాల స్పైసీ వంటకాలన్నీ లాగించేస్తున్నాను. ఆవకాయ, గోంగూర పచ్చడి ఏదీ వదలడం లేదు.”

ఇలా మొహమాటపడకుండా అన్నీ తినేస్తున్నానని చెబుతోంది. అయితే ఎన్ని తిన్నప్పటికీ రెగ్యులర్ గా ఎక్సర్ సైజులు చేస్తుంటానని, అందుకే తను బరువు పెరగనని చెబుతోంది ఈ బ్యూటీ. జిమ్ లో తనే ఎక్కువగా కష్టపడుతుంటానని అంతా అనుకుంటారని, కానీ తన కంటే నాగచైతన్య ఎక్కువగా వర్కవుట్స్ చేస్తుంటాడని.. తను మాత్రం కేవలం నటిస్తానని చెబుతోంది సమంత.