మోనార్క్ గా మారిన బాలయ్య

బాలయ్య బయట ఆల్రెడీ మోనార్క్. ఆయన మాట తీరు కూడా అదే విధంగా ఉంటుంది. మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు అంటూ బహిరంగంగా స్టేట్ మెంట్ ఇవ్వడం ఆయనకే చెల్లింది. అంతెందుకు.. 2 రోజుల కిందట కూడా చిరంజీవి సమక్షంలో సినీపెద్దలంతా మంత్రి తలసానిని కలిస్తే.. భూములు పంచుకుంటున్నారంటూ బాహాటంగా విమర్శించిన వ్యక్తి ఆయన. ఇప్పుడీ బాలయ్య మోనార్క్ గా మారాడు.

అవును.. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమాకు మోనార్క్ అనే టైటిల్ అనుకుంటున్నారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించాలని అనుకుంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా కోసం ఓ కొత్తమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమె ఎవరనే విషయాన్ని కూడా లాక్ డౌన్ తర్వాత అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

లాక్ డౌన్ కంటే ముందే ఈ సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ ఒకటి పూర్తయింది. జూన్ నెలాఖరుకు కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు బాలయ్య. ఓ పాత్రలో అఘోరగా కూడా కనిపించనున్నాడు.