Telugu Global
National

నిమ్మగడ్డ బొచ్చు కూడా పీకలేడు... రాజధానిలో పెద్దలకు భూములిస్తే కోర్టులకు అభ్యంతరం ఉండదు... పేదలకు ఇస్తేనే అభ్యంతరం...

మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు. బొబ్బిలి పులి సినిమాలో చెప్పినట్టు కోర్టు కోర్టుకు తీర్పు మారుతుంటుందన్నారు. సుప్రీం కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఆర్డర్‌ తెచ్చుకున్నంత మాత్రాన నిమ్మగడ్డ రమేష్ కుమార్ బొచ్చు కూడా పీకలేడని మంత్రి వ్యాఖ్యానించాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందించాలని తపన పడుతుంటే కోర్టులు జోక్యం చేసుకుని ప్రభుత్వ […]

నిమ్మగడ్డ బొచ్చు కూడా పీకలేడు... రాజధానిలో పెద్దలకు భూములిస్తే కోర్టులకు అభ్యంతరం ఉండదు... పేదలకు ఇస్తేనే అభ్యంతరం...
X

మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు. బొబ్బిలి పులి సినిమాలో చెప్పినట్టు కోర్టు కోర్టుకు తీర్పు మారుతుంటుందన్నారు. సుప్రీం కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఆర్డర్‌ తెచ్చుకున్నంత మాత్రాన నిమ్మగడ్డ రమేష్ కుమార్ బొచ్చు కూడా పీకలేడని మంత్రి వ్యాఖ్యానించాడు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందించాలని తపన పడుతుంటే కోర్టులు జోక్యం చేసుకుని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వద్దు… పేద పిల్లలకు తెలుగుమీడియంలోనే చదువు చెప్పాలంటోందన్నారు. అయినా ఇంగ్లీష్ మీడియం పేదలకు అందిస్తామన్నారు. నూటికి 98 శాతం మంది ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారని నాని వివరించారు.

రాజధాని ప్రాంతంలో 20వేల మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే… పేదలకు రాజధానిలో భూములు ఇవ్వొద్దన్నారని మంత్రి వ్యాఖ్యానించారు. అదే ఎవరైన డబ్బున్న వారు దరఖాస్తు పెట్టుకుని ఎకరం 10 లక్షలకే రాజధానిలో 500 ఎకరాలు తీసుకుంటే అప్పుడు కోర్టులకు అభ్యంతరం లేకుండాపోయిందన్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే మాత్రం రాజధానిలో అభివృద్ది ఆగిపోతుంది… రాజధానిలో పేదలుంటే నాశనం అయిపోతోంది అని ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని కోర్టులు అంటున్నాయని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఆటుపోట్లు జగన్‌మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదని… 16 నెలలు జైలు జీవితం కూడా అనుభవించి వచ్చారని… ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు న్యాయంచేసే విషయంలో ముందుకే వెళ్తామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

First Published:  30 May 2020 11:15 PM GMT
Next Story