Telugu Global
NEWS

పార్టీ మార్పుపై పర్చూరు ఎమ్మెల్యే క్లారిటీ...

ఆన్‌లైన్‌ మహానాడులో కనిపించలేదు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారుతారని విస్త్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో ఆయన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయనే ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. గత కొన్ని రోజులుగా ఈయన పార్టీ మారుతారని జిల్లా అంతటా ప్రచారం జరిగింది. రెండు రోజుల కిందట సీఎం జగన్ ని‌ కలుస్తారని వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ..ఆయన మాత్రం సీఎంని కలవలేదు. కానీ […]

పార్టీ మార్పుపై పర్చూరు ఎమ్మెల్యే క్లారిటీ...
X

ఆన్‌లైన్‌ మహానాడులో కనిపించలేదు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారుతారని విస్త్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో ఆయన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయనే ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.

గత కొన్ని రోజులుగా ఈయన పార్టీ మారుతారని జిల్లా అంతటా ప్రచారం జరిగింది. రెండు రోజుల కిందట సీఎం జగన్ ని‌ కలుస్తారని వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ..ఆయన మాత్రం సీఎంని కలవలేదు. కానీ ఇప్పుడు కార్యకర్తల మీటింగ్‌ పెట్టారు.

మరోవైపు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఏలూరి ఓ లేఖ రాశారు. ‘పర్చూరు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు, నమస్కారం.. పర్చూరు నియోజకవర్గం నుంచి గత రెండు పర్యాయాలుగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి శాసనసభ్యునిగా ఎన్నుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నాతో పాటు రెండు పర్యాయాలు అందరూ అహర్నిశలు శ్రమించారు. నాటి నుండి ప్రతి క్షణం, ప్రతి ఆలోచన పర్చూరు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు మనందరం సమిష్టిగా పని చేశాం’ అన్నారు.

‘భవిష్యత్తులో కూడా పర్చూరు నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా కృషి చేస్తాను. నా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఏ రంగంలో ఉన్నా నిరంతరం మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించాను. మన ప్రాంత రైతాంగం యొక్క ఆదాయం పెరగాలని, రైతు కూలీల పేదరికం తొలగాలని, వృద్ధాప్యంలో కష్టంలో ఉన్న ప్రతివారికి వారి బిడ్డగా తోడుండాలని కలలుగన్నాను. అలాగే మన పిల్లలకు మంచి విద్యా, ఉద్యోగవకాశాల కోసం కృషిచేశాను. మన మహిళల ఆదాయమార్గాల పెంపుకోసం కులమతాలకతీతంగా నిత్యం వినూత్నంగా ఆలోచన చేశాం’అని లేఖలో ప్రస్తావించారు.

ఈ లేఖతో ఏలూరి సాంబశివరావు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

*పర్చూరు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు, నమస్కారం…*పర్చూరు నియోజకవర్గం…

Publiée par Sambasivarao Yeluri sur Vendredi 29 mai 2020

First Published:  30 May 2020 9:31 PM GMT
Next Story