Telugu Global
National

తెలంగాణ కాంగ్రెస్ ‌లో కోవర్టుల లొల్లి... కొత్త బాస్‌ వచ్చేదెప్పుడో..?

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ కోవర్టుల లొల్లి మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్‌ కోవర్టులు ఉన్నారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్స్ చేశారు. మరోవైపు రేవంత్‌ రెడ్డికి పీసీసీ ఇస్తే ఊరుకునేది లేదని ఈయన హెచ్చరించారు. ఉత్తమ్‌ను కొనసాగించాలని ఈయన డిమాండ్‌ చేశారు. అయితే రేవంత్‌ వర్గం మాత్రం అసలు టీఆర్‌ఎస్‌ కోవర్టు ఉత్తమ్‌, జగ్గారెడ్డి, విహెచ్‌ అని ఆరోపిస్తోంది. అధికార పార్టీ నుంచి ప్యాకేజీలు వస్తే వీళ్లు ప్రెస్‌మీట్లు పెడతారని….లేకపోతే ఒక్కమాట కూడా మాట్లాడరని అంటోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా […]

తెలంగాణ కాంగ్రెస్ ‌లో కోవర్టుల లొల్లి... కొత్త బాస్‌ వచ్చేదెప్పుడో..?
X

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ కోవర్టుల లొల్లి మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్‌ కోవర్టులు ఉన్నారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్స్ చేశారు.

మరోవైపు రేవంత్‌ రెడ్డికి పీసీసీ ఇస్తే ఊరుకునేది లేదని ఈయన హెచ్చరించారు. ఉత్తమ్‌ను కొనసాగించాలని ఈయన డిమాండ్‌ చేశారు.

అయితే రేవంత్‌ వర్గం మాత్రం అసలు టీఆర్‌ఎస్‌ కోవర్టు ఉత్తమ్‌, జగ్గారెడ్డి, విహెచ్‌ అని ఆరోపిస్తోంది. అధికార పార్టీ నుంచి ప్యాకేజీలు వస్తే వీళ్లు ప్రెస్‌మీట్లు పెడతారని….లేకపోతే ఒక్కమాట కూడా మాట్లాడరని అంటోంది.

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చాల్సిన పనిలేదని, ఆయన బలమైన నాయకుడని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నారు . ఉత్తమ్‌ భార్య పద్మావతిని ఎన్నికల్లో గెలిపించుకోలేనంత మాత్రాన ఆయన బలహీనుడు కాదని.. అందరినీ గెలిపిస్తానని చెప్పి తానే ఓడిపోయిన రేవంత్‌ బలవంతుడెలా అవుతాడని ప్రశ్నించారు.

దీంతో పాటు రేవంత్‌పై తనకు కొన్ని అపోహలున్నాయని, వాటి గురించి రేవంత్‌తోనే మాట్లాడుతానన్నారు. కాంగ్రెస్‌లోకి వచ్చి ఎంపీగా గెలిచి.. అధికార పార్టీ పై పోరాటం చేస్తున్న రేవంత్‌పై జగ్గారెడ్డికి ఉన్న అపోహలేంటని, అలాంటి వ్యాఖ్యల వెనుక జగ్గారెడ్డి ఆంతర్యం ఏమిటనేది.. అంతుపట్టడం లేదు. పైగా రేవంత్‌కు టీపీసీసీ ఇవ్వద్దంటూ రాహుల్‌గాంధీకి లేఖ రాస్తానని చెప్పారు.

మరోవైపు దామోదర రాజనర్సింహ్మ, విహెచ్‌… పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో సమావేశమయ్యారు. జూన్ 2 దీక్షలతో పాటు ఇతర కాంగ్రెస్‌ వ్యవహారాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.

First Published:  31 May 2020 8:46 PM GMT
Next Story