నయనతార పెళ్లి ఎప్పుడంటే?

హీరోయిన్లు, పుకార్లు ఓ జాయింట్ ప్యాకేజీ లాంటివి. ఎక్కడ హీరోయిన్ ఉంటే అక్కడ పుకారు ఉంటుంది. మరీ ముఖ్యంగా నయనతార లాంటి స్టార్ హీరోయిన్లైతే ఈ పుకార్లతో సహజీవనం చేయాల్సిందే. రోజుకో గాసిప్ వస్తుంటుంది, భరించాల్సిందే. తాజాగా అలాంటిదే మరో పుకారు నయనతార చుట్టూ చక్కర్లు కొడుతోంది. కాకపోతే ఇది స్వీట్ గాసిప్.

అవును.. లాక్ డౌన్ ముగిసిన వెంటనే నయనతార పెళ్లి చేసుకుంటుందట. ప్రస్తుతం కోలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్న పుకారు ఇది. నిజానికి ఈ పాటికే నయనతారకు పెళ్లి అయిపోవాల్సిందట. లాక్ డౌన్ కారణంగా ఆమె వివాహం వాయిదా పడిందని.. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే పెళ్లి ఉంటుందనేది ఆ పుకార్ల సారాంశం.

కొన్నేళ్లుగా నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమపక్షులు చాలా దేశాలు చుట్టేశాయి. లాక్ డౌన్ వల్ల చెన్నైలో ఉండిపోయారు కానీ లేదంటే ఈపాటికి ఇంకో దేశం చుట్టివచ్చేవాళ్లు. వీళ్ల ప్రేమ వ్యవహారం కోలీవుడ్ లో బహిరంగ రహస్యం. సో.. ఇక పెళ్లి ఒక్కటే బ్యాలెన్స్. ఆ ముచ్చట కూడా లాక్ డౌన్ తర్వాత తీరిపోతుందంటోంది కోలీవుడ్ మీడియా.