పెళ్లి తర్వాత స్పీడ్ పెంచాడు

పెళ్లి తర్వాత ఎవరైనా గ్యాప్ తీసుకుంటారు. గ్యాప్ తీసుకోవడం ఇష్టం లేకపోతే సినిమాలైనా తగ్గిస్తారు. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ నిఖిల్ మాత్రం దీనికి పూర్తి రివర్స్ లో వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ హీరో, గ్యాప్ తీసుకోవడం లేదు. పైపెచ్చు సినిమాల సంఖ్య కూడా పెంచాడు.

అవును.. బ్యాక్ టు బ్యాక్ 6 సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్నాడు నిఖిల్. వీటిలో 2 సినిమాలు ఆల్రెడీ మొదలయ్యాయి. మరో 4 సినిమాల్ని కూడా వెంటవెంటనే స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. నిఖిల్ హీరోగా కార్తికేయ-2, 18-పేజెస్ అనే సినిమాలు స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే ఈ రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు నిఖిల్.

ఈ రెండు సినిమాలతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు నిఖిల్. దీని తర్వాత గీతాఆర్ట్స్-2 బ్యానర్ పైనే మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు.

ఈ రెండు సినిమాలతో పాటు.. ఇద్దరు కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తూ మరో రెండు సినిమాలు చేయబోతున్నాడు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ 6 సినిమాల్ని పూర్తిచేయాలని అనుకుంటున్నాడు నిఖిల్.