కాజల్ నో చెబితే అనుష్క ఓకే చేసింది!

కథల ఎంపిక విషయంలో కాజల్, అనుష్కకు మధ్య ఎప్పుడూ ఎలాంటి పోటీ ఎదురుకాలేదు. ఎందుకంటే ఇండస్ట్రీకొచ్చి పుష్కరం దాటినా కాజల్ ఇంకా గ్లామర్ పాత్రలే చేస్తోంది. అటు అనుష్క మాత్రం చాన్నాళ్ల కిందటే రూటు మార్చేసింది. హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రల వైపు మళ్లింది. సో.. కథల ఎంపిక విషయంలో వీళ్లిద్దరి మధ్య పోటీ లేదు. కానీ ఒక సినిమా మాత్రం వీళ్లకు పోటీపెట్టింది.

అవును.. అలివేలు వెంకటరమణ అనే సినిమా అటు కాజల్, ఇటు అనుష్క మధ్య దోబూచులాడుతోంది. ఎవరు దీనికి ఓకే చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. తేజ దర్శకత్వంలో గోపీచంద్ చేయబోయే సినిమా ఇది. ఇందులో హీరో పాత్ర కంటే హీరోయిన్ పాత్రకే వెయిట్ ఎక్కువ.

ఈ పాత్రను ముందుగా కాజల్ తో చేయించాలనుకున్నాడు తేజ. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది కాబట్టి కాజల్ ఫిక్స్ అనుకున్నారంతా. కానీ కాజల్ డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతోంది. లాక్ డౌన్ వల్ల ఆమె కాల్షీట్లు వేస్ట్ అయ్యాయి. షూటింగ్స్ మొదలైన వెంటనే చిరంజీవి సినిమాకు ఆమె డేట్స్ ఇవ్వాలి. కాబట్టి తేజ-గోపీచంద్ సినిమాకు ఆమె హ్యాండ్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి

సరిగ్గా ఇక్కడే అనుష్క పేరు తెరపైకొచ్చింది. ఈ పాత్రను అనుష్కతో చేయిస్తే బాగుంటుందని తేజ ఫీల్ అవుతున్నాడు. అటు గోపీచంద్ కూడా అనుష్క అయితే బాగుంటుందని చెప్పాడట. ఎందుకంటే ఇంతకుముందు వీళ్లిద్దరూ శౌర్యం, లక్ష్యం లాంటి సినిమాలు చేశారు. అంతా అనుకున్నట్టు జరిగితే 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గోపీచంద్-అనుష్క కాంబో మరోసారి సెట్ అవ్వబోతోంది.