మియా జార్జ్ కు పెళ్లి ఫిక్స్

హీరోయిన్లకు రెండే ఆప్షన్లు. అవకాశాలు తగ్గితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాలి. అది కూడా కుదరకపోతే ఎంచక్కా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలవ్వాలి. ఈ రెండో ఆప్షన్ సెలక్ట్ చేసుకుంది హీరోయిన్ మియా జార్జ్. సునీల్ సరసన ఉంగరాల రాంబాబు అనే సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది.

ఉంగరాల రాంబాబు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా దెబ్బకు సునీల్ నిలదొక్కుకోగలిగాడు కానీ మియా జార్జ్ మాత్రం నిలబడలేకపోయింది. అలా టాలీవుడ్ కు పూర్తిగా దూరమైన ఈ మలయాళీ భామ.. ఇక పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలవ్వాలని నిర్ణయించుకుంది. కేరళకు చెందిన అశ్విన్ ఫిలిప్ అనే బిజినెస్ మేతో పెళ్లికి రెడీ అయిపోయింది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో కేవలం ఓ 10 మంది సమక్షంలో మియా జార్జ్, అశ్విన్ ఫిలిప్ నిశ్చితార్థం ముగిసింది. ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. సెప్టెంబర్ లో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. నిశ్చితార్థం విషయాన్ని బయటపెట్టిన మియా జార్జ్.. ఇకపై తను పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే పరిమితమౌతానని విస్పష్టంగా ప్రకటించింది.