Telugu Global
NEWS

నాలుగో స్థానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌

అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు చోటు దక్కింది. ప్రజల నుంచి మంచి మార్కులనే జగన్‌ సాధించారు. సీ-ఓటర్స్ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ నాలుగో స్థానంలో ఉన్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో తొలి స్థానంలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. నవీన్ పాలన పట్ల సర్వేలో పాల్గొన్న వారిలో 82. 96 శాతం మంది మద్దతుగా నిలిచారు. […]

నాలుగో స్థానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌
X

అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు చోటు దక్కింది. ప్రజల నుంచి మంచి మార్కులనే జగన్‌ సాధించారు. సీ-ఓటర్స్ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ నాలుగో స్థానంలో ఉన్నారు.

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో తొలి స్థానంలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. నవీన్ పాలన పట్ల సర్వేలో పాల్గొన్న వారిలో 82. 96 శాతం మంది మద్దతుగా నిలిచారు. రెండో స్థానంలో చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భుపేష్‌ , మూడో స్థానంలో కేరళ సీఎం విజయన్ ఉన్నారు. విజయన్‌కు 80. 06 శాతం మంది మద్దతు లభించింది.

అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు. జగన్‌ మోహన్ రెడ్డి పాలనకు సర్వేలో పాల్గొన్న వారిలో 78.01 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరో స్థానంలో ఉన్నారు.

అతి తక్కువ ప్రజామోదం ఉన్న ముఖ్యమంత్రిగా హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ నిలిచారు. ఈయనకు కేవలం 4.47 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. అతి తక్కువ పాపులారిటి ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నట్టు సీ – ఓటర్స్ సర్వే చెబుతోంది. కేసీఆర్‌ పాలన పట్ల 54. 22 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాల్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా ముఖ్యమంత్రులు కూడా తక్కువ ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలోకి ఉన్నారు.

జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ మరోసారి పాపులర్‌గా నిలిచారు. 66.2 శాతం మంది ప్రధాని నరేంద్ర మోడీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ నాయకత్వానికి 23. 21 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. నరేంద్రమోడీకి అతి తక్కువ పాపులారిటీ ఉన్న రాష్ట్రాలుగా దక్షిణాదికి చెందిన తమిళనాడు, కేరళ నిలిచాయి. తమిళనాడులో మోడీ నాయకత్వం పట్ల సర్వేలో పాల్గొన్న వారిలో 32 . 15 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. కేరళలో మోడీ పట్ల 32. 89 శాతం మంది మాత్రమే సానుకూలత చూపారు. గోవా, తమిళనాడు, కేరళ… ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రం నరేంద్రమోడీ కంటే స్వల్పంగా రాహుల్‌గాంధీకే ఎక్కువ మద్దతు లభిస్తున్నట్టు సీ ఓటర్స్ తెలిపింది. మే నెలలో ఈ సర్వేను నిర్వహించారు.

First Published:  2 Jun 2020 5:12 AM GMT
Next Story