జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. నేడు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, కేంద్ర గనుల శాఖ మంత్రిని జగన్‌మోహన్ రెడ్డి కలవాల్సి ఉంది. ఇంతలో పర్యటన వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన కారణాలు  ఇంకా వెల్లడి కాలేదు.