Telugu Global
National

డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసులు

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది. వాస్తవ వీడియోలను పరిశీలించిన తర్వాత సీబీఐ సుధాకర్‌పై కేసులు పెట్టింది. లాక్‌డౌన్‌ సమయంలో విశాఖలో నడిరోడ్డు మీద తాగి వీరంగం చేస్తున్న సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ముఖ్యమంత్రి, ప్రధానిపైన నోటికొచ్చినట్టు తిట్టారు. రెండు మతాలను పేర్లు పెట్టి మరీ దూషించారు. పోలీసులపై సిగరెట్లు వేశారు. దాంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా అరెస్ట్ […]

డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసులు
X

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది. వాస్తవ వీడియోలను పరిశీలించిన తర్వాత సీబీఐ సుధాకర్‌పై కేసులు పెట్టింది.

లాక్‌డౌన్‌ సమయంలో విశాఖలో నడిరోడ్డు మీద తాగి వీరంగం చేస్తున్న సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ముఖ్యమంత్రి, ప్రధానిపైన నోటికొచ్చినట్టు తిట్టారు. రెండు మతాలను పేర్లు పెట్టి మరీ దూషించారు. పోలీసులపై సిగరెట్లు వేశారు. దాంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

ఇలా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత ఎడిటింగ్ వీడియోలతో హైకోర్టులో కేసు వేయడం, ఆ తర్వాత సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించడం జరిగిపోయాయి.

దర్యాప్తు మొదలు పెట్టిన సీబీఐ ఇప్పటికే పలువురిని విచారించింది. సుధాకర్‌ నుంచి కూడా స్టేట్‌మెంట్ తీసుకుంది. హైకోర్టుకు సమర్పించిన ఎడిటింగ్ వీడియోలను కాకుండా… పూర్తి వీడియోను సీబీఐ అధికారులు పరిశీలించారు. కొందరు ప్రత్యక్షసాక్ష్యులను కూడా విచారించారు. వాటి ఆధారంగా తొలుత న్యూసెన్స్ మొదలుపెట్టింది సుధాకరేనని నిర్ధారించారు.

పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడిరోడ్డు మీద ముఖ్యమంత్రులను, ప్రధానిని దూషించినందుకు, అలాగే విధి నిర్వాహణలో ఉన్న పోలీసులను దూషించినందుకు, స్థానికులను భయభ్రాంతులను చేసినందుకు, కానిస్టేబుల్‌ సెల్‌ఫోన్‌ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినందుకు గాను పలు సెక్షన్ల కింద సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో 23 మంది సాక్ష్యులను విచారించారు. వారిలో అత్యధికులు సుధాకరే తాగి వచ్చి గొడవ మొదలుపెట్టారని చెప్పారు.

First Published:  2 Jun 2020 8:57 PM GMT
Next Story