తమ్ముడు చేసిన పనికి అన్న బలి

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఊహించని విధంగా బుక్ అయిపోయాడు. తన తమ్ముడు చేసిన పాడు పనికి ఇప్పుడు అందరూ నవాజుద్దీన్ ను తిడుతున్నారు. ఇంతకీ ఈయన తమ్ముడు ఏం చేశాడో తెలుసా.. తనకు కూతురు వరసైన అమ్మాయిని లైంగికంగా వేధించాడు.

అవును.. మా చిన్నాన్న (నవాజుద్దీన్ తమ్ముడు) తనను లైంగికంగా వేధించాడంటూ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నవాజుద్దీన్ ది కూడా తప్పు ఉంది. తనపై జరిగిన లైంగిక వేధింపుల విషయాన్ని పెదనాన్న నవాజుద్దీన్ కు చెప్పుకుంది సదరు యువతి. అయితే చిన్నాన్న అలా చేయడని, ఇంకెప్పుడూ ఇలా మాట్లాడొద్దని నవాజుద్దీన్ వారించాడు. సరిగ్గా ఇదే ఇప్పుడు నవాజుద్దీన్ మెడకు చుట్టుకుంది.

అయితే ఇదంతా ఇప్పటి వ్యవహారం కాదు. తనకు 9 ఏళ్లు ఉన్నప్పుడు తన బాబాయ్ లైంగికంగా వేధించాడని చెబుతోంది యువతి. అప్పుడు తను నరకం చూశానని, ఏం చేయాలో తెలియలేదని, ఇప్పుడు తనకు లోకజ్ఞానం తెలిసొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెబుతోంది యువతి.