రెస్ట్ తీసుకోవడం కోసం అలా చేసిందట

ఆమధ్య ఉన్నట్టుండి సడెన్ గా ఇనస్టాగ్రామ్ నుంచి మాయమైంది హీరోయిన్ ప్రియా వారియర్. వింక్ సెన్సేషన్ (కన్నుగీటి సంచలనం సృష్టించింది)గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ చెప్పాపెట్టకుండా సడెన్ గా ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ ను డిజేబుల్ చేసింది. దీంతో ఆమెపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. అయితే అంతలోనే మళ్లీ ఇనస్టాగ్రామ్ లో రీఎంట్రీ ఇచ్చింది ప్రియా వారియర్.

తను ఎందుకు తప్పుకున్నానో, తిరిగి ఎందుకొచ్చానో వివరంగా చెప్పుకొచ్చింది ఈ చిన్నది. కేవలం మానసిక ప్రశాంతత కోసమే ఆమె ఇనస్టాగ్రామ్ నుంచి తప్పుకుందట. అంతకుమించి పెద్దగా కారణం లేదంటోంది. కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకొని, ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చేశానని చెబుతోంది.

తను ఇనస్టాగ్రామ్ నుంచి తప్పుకున్న తర్వాత తనపై వచ్చిన కామెంట్స్ అన్నీ చూశానంటోంది ప్రియా వారియర్. దాదాపు అన్ని కామెంట్స్ చూసి నవ్వుకున్నానని, కానీ ఒకే ఒక్క కామెంట్ మాత్రం తనను బాధపెట్టిందని చెప్పుకొచ్చింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఇనస్టాగ్రామ్ నుంచి ప్రియా వారియర్ తప్పుకుందనే కామెంట్ ఆమెను బాగా బాధపెట్టిందట.