Telugu Global
Cinema & Entertainment

లవ్ స్టోరీకి పెరిగిన డిమాండ్

ఓ వైపు శేఖర్ కమ్ముల, మరోవైపు నాగచైతన్య, మధ్యలో సాయిపల్లవి… అందుకే లవ్ స్టోరీ సినిమాకు మంచి డిమాండ్ వచ్చింది. కమ్ముల-సాయిపల్లవి కాంబోలో గతంలో ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇక నాగచైతన్య-సాయిపల్లవిది మోస్ట్ వాంటెడ్ పెయిర్ అనిపించుకుంది. అందుకే లవ్ స్టోరీ సినిమా మార్కెట్లో హాట్ కేక్ గా మారింది. కేవలం నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ సినిమా 16 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అల్లు అరవింద్ […]

లవ్ స్టోరీకి పెరిగిన డిమాండ్
X

ఓ వైపు శేఖర్ కమ్ముల, మరోవైపు నాగచైతన్య, మధ్యలో సాయిపల్లవి…
అందుకే లవ్ స్టోరీ సినిమాకు మంచి డిమాండ్ వచ్చింది. కమ్ముల-సాయిపల్లవి కాంబోలో గతంలో ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇక నాగచైతన్య-సాయిపల్లవిది మోస్ట్ వాంటెడ్ పెయిర్ అనిపించుకుంది. అందుకే లవ్ స్టోరీ సినిమా మార్కెట్లో హాట్ కేక్ గా మారింది. కేవలం నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ సినిమా 16 కోట్ల రూపాయలు ఆర్జించింది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అల్లు అరవింద్ కు చెందిన ఆహా సంస్థ దక్కించుకుంది. 6 కోట్ల 30 లక్షల రూపాయలకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి.

ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. ఈ హక్కులు 5 కోట్ల 70 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి. వీటితో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ 4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.

ఇలా నాన్-థియేట్రికల్ ద్వారా 16 కోట్ల రూపాయలు ఆర్జించింది లవ్ స్టోరీ. ఇంకా సౌత్ డబ్బింగ్, ఆడియో రైట్స్ ఓపెన్ లోనే ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుంటే మరో 2 కోట్ల రూపాయల వరకు వచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  4 Jun 2020 10:04 AM GMT
Next Story