అభిమానుల్ని నిరాశపరిచిన హీరోయిన్

2 రోజులుగా సిమ్రాన్ పై ఓ పుకారు జోరుగా నడుస్తోంది. అదేంటంటే.. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న చంద్రముఖి-2లో ఆమె మెయిన్ లీడ్ లో కనిపించనుందట. దీంతో ఆమె అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ సిమ్రాన్ మాత్రం ఆ పుకార్లను ఖండించింది. తను చంద్రముఖి-2లో నటించడం లేదని స్పష్టం చేసింది. అభిమానుల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించాలని వేడుకుంది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. చంద్రముఖి సినిమా జ్యోతికకు ఎనలేని పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాతో రజనీకాంత్ కంటే జ్యోతికకే ఎక్కువ పేరొచ్చింది. అలాంటి సినిమాకు సీక్వెల్ తీస్తూ, జ్యోతికను తీసుకోకుండా మరో హీరోయిన్ ను తీసుకోవడం సాహసమనే చెప్పాలి. అందుకే సిమ్రాన్ వెంటనే రియాక్ట్ అయింది. చంద్రముఖి-2కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది.

నిజానికి చంద్రముఖి-2ను జ్యోతికతోనే ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో సిమ్రాన్ పేరు ఎలా తెరపైకి వచ్చిందో తమకు తెలియదంటోంది యూనిట్. అన్నట్టు ఈ సినిమాలో రజనీకాంత్ నటించడం లేదు. మరో సీనియర్ నటుడి కోసం చూస్తున్నారు.