దర్శకుడు సుజీత్ పెళ్లి ఫిక్స్

సాహో సినిమాతో ఘోరంగా దెబ్బతిన్నాడు దర్శకుడు సుజీత్. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత చాన్నాళ్లు ఇంటికే పరిమితమైపోయిన ఈ డైరక్టర్, తన నెక్ట్స్ సినిమాకు ఏకంగా చిరంజీవిని డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. చిరంజీవితో లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడు ఈ దర్శకుడు.

అయితే లూసిఫర్ రీమేక్ సెట్స్ పైకి వెళ్లడానికి టైమ్ పడుతుంది. ఆచార్య పూర్తయి, థియేటర్లలోకి వచ్చేంతవరకు లూసిఫర్ ప్రారంభం కాదు. సో.. ఈ గ్యాప్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సుజీత్. ఆల్రెడీ ఇంట్లో అతడికి ఓ సంబంధం చూసి పెట్టారు. అమ్మాయి హైదరాబాద్ లో డెంటిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెతో సుజీత్ వివాహం త్వరలోనే జరగనుంది.

సాహో ఫ్లాప్ అయినా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ సుజీత్ కు అండగా నిలబడింది. త్వరలోనే అతడికి మరో సినిమా ఛాన్స్ ఇవ్వబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ చరణ్ ను సుజీత్ డైరక్ట్ చేసే ఛాన్స్ ఉంది.