Telugu Global
National

చంద్రబాబు బాటలోనే టీడీపీ నేతలు.... జనానికి దూరంగా....

కరోనా లాక్‌డౌన్‌ ప్రారంభమైన తర్వాత టీడీపీ నేతలు కనిపించకుండాపోయారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. దాదాపు రెండు నెలల తర్వాత చుట్టం చూపుగా అమరావతి వచ్చారు. మహానాడు రెండు రోజులు ఆన్‌లైన్‌లో నిర్వహించి మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లారు. విశాఖ ఎల్జీపాలిమర్స్‌ బాధితులను పరామర్శ పేరుతో డీజీపీని పర్మిషన్‌ అడిగారు. కానీ ఆతర్వాత అమరావతికి మాత్రమే వెళ్లి తిరిగి వచ్చారు. వారం రోజులుగా హైదరాబాద్‌లో ఇంటి నుంచి తండ్రీకొడుకులు బయటకు రావడం లేదు. కరోనా భయమో తెలియదు… […]

చంద్రబాబు బాటలోనే టీడీపీ నేతలు.... జనానికి దూరంగా....
X

కరోనా లాక్‌డౌన్‌ ప్రారంభమైన తర్వాత టీడీపీ నేతలు కనిపించకుండాపోయారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. దాదాపు రెండు నెలల తర్వాత చుట్టం చూపుగా అమరావతి వచ్చారు. మహానాడు రెండు రోజులు ఆన్‌లైన్‌లో నిర్వహించి మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లారు.

విశాఖ ఎల్జీపాలిమర్స్‌ బాధితులను పరామర్శ పేరుతో డీజీపీని పర్మిషన్‌ అడిగారు. కానీ ఆతర్వాత అమరావతికి మాత్రమే వెళ్లి తిరిగి వచ్చారు. వారం రోజులుగా హైదరాబాద్‌లో ఇంటి నుంచి తండ్రీకొడుకులు బయటకు రావడం లేదు. కరోనా భయమో తెలియదు… పార్టీ కార్యక్రమాలు అంటే చిన్న చూపో తెలియదు. కానీ చంద్రబాబు మాత్రం అడుగు బయటపెట్డడం లేదు.

పార్టీ అధినేత రాకపోవడంతో ఐదు నెలలుగా టీడీపీ నేతలు కూడా మొహం చాటేశారు. తమ సొంత వ్యాపారాలకే పరిమితమయ్యారు. 23 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తప్పా మిగతా నేతలు ఎక్కడున్నారో సొంత పార్టీ కార్యకర్తలకు కూడా తెలియదు.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇప్పడిప్పుడే బయటకు వస్తున్నారు. గాంధీభవన్‌లో… దీక్షల నుంచి నిరసనలకు పిలుపు ఇస్తున్నారు. ముట్టడిలు చేపడుతున్నారు. కానీ ఏపీ టీడీపీలో మాత్రం మొత్తం సైలెంట్‌. కరోనా వైరస్‌ భయంతో కాదు… జనం అంటే భయంతోనే టీడీపీ నేతలు ఇళ్లకు పరిమితమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం చేసే కార్యక్రమాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్న తీరుపై జనం నిలదీస్తారనే భయంతోనే టీడీపీ నేతలు బయటకు రావడంలేదన్న గుసగుసలు విన్పిస్తున్నాయి.

కరోనా వైరస్‌కు ముందు శ్రీలంకకు వెళ్లి జల్సాలు చేసిన టీడీపీ నేతలు….ఇప్పుడు హైదరాబాద్‌, బెంగళూరు ఫామ్‌హౌస్‌ల్లో సేదతీరుతున్నారట.

మొత్తానికి ఏడాదిగా జనానికి దూరమైన ప్రతిపక్షం మాత్రం రోజురోజుకు పట్టు కోల్పోతోంది.

First Published:  4 Jun 2020 8:02 PM GMT
Next Story