రూటు మార్చిన బన్నీ, మహేష్

మరికొన్ని రోజుల్లో షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. దీంతో చాలా యూనిట్లు, తమ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కు ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో బన్నీ, మహేష్ మాత్రం తొందరపడడం లేదు. సినిమా షూటింగ్ కంటే ముందు సేఫ్టీ ఇంపార్టెంట్ అంటున్నారు వీళ్లు.

అవును.. షూటింగ్స్ మొదలైన వెంటనే పుష్ప సెట్స్ పైకి రావడం లేదు. మరో 2 నెలలు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. కుదిరితే ఆగస్ట్ ఆఖరి వారంలో లేకపోతే సెప్టెంబర్ నుంచి షూటింగ్స్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గుతుందని వీళ్ల భావన.

అటు మహేష్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాను ప్రకటించిన ఈ హీరో.. ఆ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వచ్చేలా ప్లాన్ చేయాలని యూనిట్ కు చెప్పేశాడు. సెప్టెంబర్ కంటే ముందు సెట్స్ పైకి వచ్చే ఉద్దేశం తనకు లేదని, యూనిట్ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహేష్ దర్శక-నిర్మాతలకు చెప్పేశాడు.

ఇలా షూటింగ్స్ మొదలైనప్పటికీ హీరోలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అటు చిరంజీవి కూడా అందరికంటే ముందే షూటింగ్ స్టార్ట్ చేస్తారని అనుకున్నప్పటికీ.. బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలతో వెనక్కి తగ్గారు. ఆచార్య షూటింగ్ ను ఆగస్ట్ కు పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారు.