లాక్ డౌన్ తర్వాత రోడ్ ట్రిప్

లాక్ డౌన్ తో 3 నెలలుగా ఇంట్లోనే ఉండిపోయిన హీరోయిన్లు లాక్ డౌన్ ముగిసిన వెంటనే వెకేషన్ (లాంగ్ ట్రిప్స్) కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి పరిస్థితులు మారాయి కదా. అందుకే హీరోయిన్లంతా ఇండియాలోనే కొత్త కొత్త లొకేషన్లు వెదుక్కుంటున్నారు. విదేశాలకు వెళ్లేందుకు మాత్రం నో అంటున్నారు. దీనిపై హీరోయిన్ మెహ్రీన్ కూడా స్పందించింది. లాక్ డౌన్ తర్వాత తను కూడా విహారయాత్రకు వెళ్తానంటోంది.

సాధారణంగా అమెరికా, యూకే, పారిస్ అంటే మెహ్రీన్ కు ఇష్టం. ఆ దేశాల్లో షాపింగ్ చేయడాన్ని ఆమె బాగా ఇష్టపడుతుంది. పైగా ఎన్నారై కూడా కావడంతో విదేశాలంటే ఆమాత్రం ఇష్టం ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం రాజస్థాన్ కు రోడ్ ట్రిప్ వేస్తానంటోంది మెహ్రీన్. రోడ్డు మార్గంలో రాజస్థాన్ లో పర్యటించాలని అనుకుంటున్నట్టు ప్రకటించింది.

అంతేకాదు.. మెహ్రీన్ లిస్ట్ లో లఢక్ కూడా ఉంది. ఈ ప్రాంతాన్ని కూడా రోడ్డు మార్గంలోనే పర్యటించాలని మెహ్రీన్ భావిస్తోంది. ఈ ఏడాది రాజస్థాన్, లఢక్ ప్రాంతాల్ని కచ్చితంగా కవర్ చేస్తానంటోంది ఈ బ్యూటీ. అయితే ముందుగా తన సినిమాలకు కాల్షీట్లు కేటాయించి, ఆ తర్వాత వెసులుబాటు బట్టి విహారయాత్రలు చేస్తానంటోంది.