టాప్ ట్రెండింగ్ లో నిలిచిన నయనతార

నయనతారకు ట్రెండింగ్ లో నిలవడం కొత్త కాదు. ఆమె నుంచి ఏ న్యూస్ వచ్చినా, ఏ స్టిల్ వచ్చినా అది వైరల్ అవుతుంది. కాకపోతే ఈసారి ఆ ట్రెండింగ్ లో మరింత ప్రత్యేకత కనిపించింది. అవును.. ఆదిపరాశక్తిగా కనిపించింది నయనతార. దీంతో ఆ స్టిల్స్ గంటల వ్యవథిలో టాప్ ట్రెండింగ్స్ లోకి వెళ్లిపోయాయి.

నయనతారను ఇన్నాళ్లు గ్లామరస్ గానే చూశారంతా. ఆమెకు సంబంధించి రియల్ లైఫ్ స్టిల్స్ కూడా చూశారు. మేకప్ లేకుండా ఉన్న స్టిల్స్ కూడా చూశారు. కానీ ఫస్ట్ టైమ్ ఇలా అమ్మవారి అవతారంలో నయనతార కనిపించడం ఇదే తొలిసారి. అందుకే ఈ ఫొటోలకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. ఆ ఫొటోలన్నీ టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. నటుడు ఆర్జే బాలాజీ ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దానిపేరు ముక్తి అమ్మాన్. ఇదొక భక్తిరస చిత్రం. ఇందులో అమ్మవారి పాత్రలో కనిపించనుంది నయనతార. సినిమాకు సంబంధించి ఆ స్టిల్స్ ను తాజాగా రిలీజ్ చేశాడు బాలాజీ. ఇప్పటివరకు చూడని కొత్త గెటప్ లో నయన్ కనిపించేటప్పటికి ఆ స్టిల్స్ వైరల్ అయ్యాయి. అదీ సంగతి.

View this post on Instagram

#mookuthiamman on spot 📸

A post shared by nayanthara🔵 (@nayantharaaa) on