Telugu Global
CRIME

రంగనాయకి చిట్టాను బయటకు తీసిన పోలీసులు

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా, ప్రభుత్వంపై అనుమానాలు కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన గుంటూరు రంగనాయకి గురించి పోలీసులు అనేక విషయాలు రాబట్టారు. ఈమెపై ఇది వరకే చాలా క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. రంగనాయకి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమెపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అని ఆరా తీయగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2011 నుంచి ఆమె పలు కేసుల్లో ఉన్నారు. […]

రంగనాయకి చిట్టాను బయటకు తీసిన పోలీసులు
X

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా, ప్రభుత్వంపై అనుమానాలు కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన గుంటూరు రంగనాయకి గురించి పోలీసులు అనేక విషయాలు రాబట్టారు.

ఈమెపై ఇది వరకే చాలా క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. రంగనాయకి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమెపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అని ఆరా తీయగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి.

2011 నుంచి ఆమె పలు కేసుల్లో ఉన్నారు. 2011లో ఓ కేసులో ఆమెకు గుంటూరు కోర్డు 5వేల రూపాయల జరిమానా విధించింది. 2014లో ఆమెపై నమోదైన ఓ సివిల్ కేసు విచారణ సందర్భంగా రూ.15.40 లక్షలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించిట్లు రికార్డులో తేలింది.

ఆమె పై ఇప్పటికీ అనేక క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. వాటిలో ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కేసులపై గుంటూరు, మార్కాపురం కోర్టుల్లో విచారణ జరుగుతోంది.

First Published:  5 Jun 2020 8:12 PM GMT
Next Story