Telugu Global
National

తెలంగాణ‌లో క‌రోనా పంజా... నిమ్స్ ఆసుప‌త్రి మూసివేత‌...

తెలంగాణలో క‌రోనా పంజా విసురుతోంది. గ‌త 24 గంట‌ల్లో 206 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఒక్క గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే 152 కేసులు పాజిటివ్ గా తేలాయి. రంగారెడ్డి, మేడ్చ‌ల్‌లో 28 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. జిల్లాలో కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో ఆందోళ‌న మొద‌లైంది. ఒక్క‌రోజే 10 మంది వైర‌స్‌తో చ‌నిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కూ 3, 946 మందికి క‌రోనా పాజిట‌వ్‌గా తేలింది. మొత్తం 123 మంది చ‌నిపోయారు. 1663 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిమ్స్ ఆసుప‌త్రిలో క‌రోనా టెన్ష‌న్ […]

తెలంగాణ‌లో క‌రోనా పంజా... నిమ్స్ ఆసుప‌త్రి మూసివేత‌...
X

తెలంగాణలో క‌రోనా పంజా విసురుతోంది. గ‌త 24 గంట‌ల్లో 206 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఒక్క గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే 152 కేసులు పాజిటివ్ గా తేలాయి. రంగారెడ్డి, మేడ్చ‌ల్‌లో 28 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.

జిల్లాలో కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో ఆందోళ‌న మొద‌లైంది. ఒక్క‌రోజే 10 మంది వైర‌స్‌తో చ‌నిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కూ 3, 946 మందికి క‌రోనా పాజిట‌వ్‌గా తేలింది. మొత్తం 123 మంది చ‌నిపోయారు. 1663 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

నిమ్స్ ఆసుప‌త్రిలో క‌రోనా టెన్ష‌న్ మొద‌లైంది. నిమ్స్‌లోని ఐదు విభాగాల‌ను 7 నుండి 9వ తేదీ వ‌ర‌కు మూసివేశారు. నిమ్స్‌లోని ప‌లు విభాగాల్లో ప‌నిచేస్తున్న వారు క‌రోనా బారిన ప‌డ్డారు. ఐదు విభాగాల‌ను ఇప్ప‌టికే మూసివేశారు.

యాదాద్రి భువ‌నగిరిలో ఇప్ప‌టివ‌ర‌కూ కరోనా కేసు న‌మోదు కాలేదు. కానీ ఇప్పుడు క‌రోనా తొలి పాజిటివ్ కేసు రికార్డు అయింది. ఢిల్లీ నుంచి వ‌చ్చిన సివిల్స్ స్టూడెంట్‌కు పాజిటివ్ వ‌చ్చింది. ఆయ‌న‌తో పాటు 9 మంది ప్రైమ‌రీ కాంటాక్ట్‌ల‌ను బీబీన‌గ‌ర్ ఎయిమ్స్‌కు త‌ర‌లించారు.

First Published:  6 Jun 2020 8:10 PM GMT
Next Story