Telugu Global
Cinema & Entertainment

అందరికీ షాకిచ్చిన ఖుష్బూ

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోహీరోయిన్లంతా తమకు ఇష్టమైన పనులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. అయితే నటి ఖుష్బూ మాత్రం ఈ టైమ్ ను ఛాలెంజింగ్ గా తీసుకుంది. చాన్నాళ్లుగా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న ఈ నటి.. ఈ లాక్ డౌన్ టైమ్ ను బరువు తగ్గడం కోసం పెర్ ఫెక్ట్ గా వాడుకుంది. ఫలితంగా.. 3 నెలల్లో అక్షరాలా 15 కిలోలు తగ్గింది. తన తాజా స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ […]

అందరికీ షాకిచ్చిన ఖుష్బూ
X

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోహీరోయిన్లంతా తమకు ఇష్టమైన పనులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. అయితే నటి ఖుష్బూ మాత్రం ఈ టైమ్ ను ఛాలెంజింగ్ గా తీసుకుంది. చాన్నాళ్లుగా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న ఈ నటి.. ఈ లాక్ డౌన్ టైమ్ ను బరువు తగ్గడం కోసం పెర్ ఫెక్ట్ గా వాడుకుంది. ఫలితంగా.. 3 నెలల్లో అక్షరాలా 15 కిలోలు తగ్గింది. తన తాజా స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఖుష్బూ. ఆ స్టిల్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు.

నిజానికి ఆ స్టిల్స్ చూసిన నెటిజన్లు.. వాటిని వింటేజ్ ఫొటోలు (పాత కాలం)గా భావించారు. కానీ తర్వాత విషయం తెలుసుకొని షాకయ్యారు.20 ఏళ్ల కిందట ఎలా ఉండేదో ఇప్పుడలా తయారైంది ఖుష్బూ. కూతురికి ఖుష్బూ పోటీ ఇస్తోందంటూ సోషల్ మీడియాలో అంతా రియాక్ట్ అవుతున్నారు.

తెలుగులో ఆమె చివరిగా అజ్ఞాతవాసి సినిమాలో కనిపించింది. త్వరలోనే మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపిస్తానని చెబుతోంది ఖుష్బూ. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉంది ఖుష్బూ.

First Published:  7 Jun 2020 9:01 AM GMT
Next Story