Telugu Global
Cinema & Entertainment

ప్రేమ గురించి ఆలోచించే టైమ్ లేదు

ప్రేమ-పెళ్లి లాంటి విషయాలపై ఇప్పటికే రియాక్ట్ అయింది రాశిఖన్నా. ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నాననే విషయాన్ని ప్రకటించింది. అయినప్పటికీ నెటిజన్లు ఊరుకోలేదు. ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి లవ్ ఎఫైర్, మ్యారేజ్ పై రియాక్ట్ అయింది రాశి. “నేను లవ్ లో ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అంతేకాదు, కాబోయే వాడి విషయంలో కూడా నాకు ఎలాంటి కోరికలు లేవు. ఇలా ఉండాలి, అలా ఉండాలి లాంటి […]

ప్రేమ గురించి ఆలోచించే టైమ్ లేదు
X

ప్రేమ-పెళ్లి లాంటి విషయాలపై ఇప్పటికే రియాక్ట్ అయింది రాశిఖన్నా. ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నాననే విషయాన్ని ప్రకటించింది. అయినప్పటికీ నెటిజన్లు ఊరుకోలేదు. ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి లవ్ ఎఫైర్, మ్యారేజ్ పై రియాక్ట్ అయింది రాశి.

“నేను లవ్ లో ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అంతేకాదు, కాబోయే వాడి విషయంలో కూడా నాకు ఎలాంటి కోరికలు లేవు. ఇలా ఉండాలి, అలా ఉండాలి లాంటి కండిషన్స్ లేవు. అసలివన్నీ కాదు, నా మనసుకు నచ్చేవాడి గురించి ఆలోచించేంత టైమ్ నాకు లేదు. కెరీర్ పైనే నా దృష్టి మొత్తం పెట్టాను. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.”

ఇలా కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది రాశిఖన్నా. తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రాశి.. ఆ క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఇలాంటి టైమ్ లో లవ్, పెళ్లి లాంటివి పెట్టుకుంటే తన కెరీర్ ఏమౌతుందో ఆమెకు బాగా తెలుసు. అందుకే అలాంటివాటికి దూరంగా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది.

First Published:  7 Jun 2020 8:41 AM GMT
Next Story