Telugu Global
Cinema & Entertainment

వెంకటేష్ కొడుకు ఎంట్రీ ఎప్పుడు?

దగ్గుబాటి వంశం నుంచి మరో హీరో రావడానికి చాలా టైమ్ పడుతుంది. ఎందుకంటే వెంకటేష్ కొడుకు అర్జున్ చిన్నోడు. ఇంకా చదువుకుంటున్నాడు. అయినప్పటికీ అతడి సిల్వర్ స్క్రీన్ డెబ్యూ కోసం వెంకీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు తన కొడుకును పరిచయం చేసినట్టుగా.. వెంకీ కూడా అర్జున్ ను పరిచయం చేయాలని కోరుతున్నారు. అయితే అర్జున్ ఎంట్రీ ఇప్పట్లో ఉండకపోవచ్చని వెంకీ అన్నయ్య సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. “అర్జున్ ఎంట్రీ ఇప్పట్లో ఉండదు. అయినా వాడు […]

వెంకటేష్ కొడుకు ఎంట్రీ ఎప్పుడు?
X

దగ్గుబాటి వంశం నుంచి మరో హీరో రావడానికి చాలా టైమ్ పడుతుంది. ఎందుకంటే వెంకటేష్ కొడుకు అర్జున్ చిన్నోడు. ఇంకా చదువుకుంటున్నాడు. అయినప్పటికీ అతడి సిల్వర్ స్క్రీన్ డెబ్యూ కోసం వెంకీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు తన కొడుకును పరిచయం చేసినట్టుగా.. వెంకీ కూడా అర్జున్ ను పరిచయం చేయాలని కోరుతున్నారు. అయితే అర్జున్ ఎంట్రీ ఇప్పట్లో ఉండకపోవచ్చని వెంకీ అన్నయ్య సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు.

“అర్జున్ ఎంట్రీ ఇప్పట్లో ఉండదు. అయినా వాడు ఇండస్ట్రీలోకి వస్తాడో రాడో కూడా తెలియదు. ఎందుకంటే మేం వాడ్ని ఫోర్స్ చేయం. వాడికి నచ్చింది వాడు సెలక్ట్ చేసుకుంటాడు. మేం అర్జున్ కు కొన్ని పారామీటర్స్ సెట్ చేశాం. అందులో ఇండస్ట్రీ కూడా ఒకటి. ఫీల్డ్ లోకి వస్తే ఏంటి లాభం, నష్టమేంటి లాంటి విషయాల్ని అతడికి వివరించాం. తుది నిర్ణయం వాడే తీసుకుంటాడు.”

ప్రస్తుతం అర్జున్ దృష్టి మొత్తం చదువు మీద ఉందంటున్నాడు సురేష్ బాబు. లాక్ డౌన్ ముగిసి, ప్రపంచదేశాలన్నీ నార్మల్ కండిషన్స్ లోకి వచ్చిన తర్వాత చదువుకోవడం కోసం అమెరికా వెళ్లడానికి ప్రిపేర్ అవుతున్నాడట అర్జున్. సో.. వెంకీ వారసుడు తెరపైకి రావడానికి ఇంకా చాలా టైమ్ పట్టేలా ఉంది.

First Published:  8 Jun 2020 11:00 PM GMT
Next Story