Telugu Global
Cinema & Entertainment

ఈ దర్శకురాలు సేఫ్...

నిన్న సడెన్ గా కళ్లుతిరిగి పడిపోయింది దర్శకురాలు సంజనారెడ్డి. ఆ టైమ్ లో ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క అరుపులు విని, చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆమెను వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అలా నిన్నంతా వార్తల్లో వ్యక్తిగా మారిన ఆమెపై 24 గంటల పాటు చాలా పుకార్లు నడిచాయి. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వాళ్లు రాసేశారు. ఎట్టకేలకు సంజనారెడ్డి హెల్త్ కండిషన్ పై అధికారిక ప్రకటన […]

ఈ దర్శకురాలు సేఫ్...
X

నిన్న సడెన్ గా కళ్లుతిరిగి పడిపోయింది దర్శకురాలు సంజనారెడ్డి. ఆ టైమ్ లో ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క అరుపులు విని, చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆమెను వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అలా నిన్నంతా వార్తల్లో వ్యక్తిగా మారిన ఆమెపై 24 గంటల పాటు చాలా పుకార్లు నడిచాయి. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వాళ్లు రాసేశారు. ఎట్టకేలకు సంజనారెడ్డి హెల్త్ కండిషన్ పై అధికారిక ప్రకటన చేశారు నిర్మాత కమ్ రచయిత కోన వెంకట్.

“మా కరణం మల్లేశ్వరి బయోపిక్ డైరక్టర్ సంజనారెడ్డి సేఫ్ గా ఉన్నారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఇంటికి చేరుకుంటారు. ఆమెకు వైరల్ ఫీవర్ వచ్చింది. ట్రీట్ మెంట్ నడుస్తోంది. దయచేసి పుకార్లు ఆపండి.”

ఇలా సంజనారెడ్డిపై వచ్చిన పుకార్లను కోన వెంకట్ ఖండించారు. సంజనారెడ్డి దర్శకత్వంలో తాజాగా వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి బయోపిక్ ను ప్రకటించారు. దానికి కోన వెంకట్ సహనిర్మాత. మరో నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ. ఈ సినిమాకు కోన వెంకట్ రచయితగా కూడా వర్క్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కూడా దాదాపు కొలిక్కి వచ్చిన టైమ్ లో సంజనారెడ్డి ఇలా అస్వస్థతకు గురయ్యారు.

First Published:  9 Jun 2020 8:30 PM GMT
Next Story